రోజులో 30 నిమిషాలు.. మీమ్స్ చూస్తున్న భారతీయులు..

ఈరోజుల్లో మీమ్స్ వాడకం పెరిగిపోయింది.తీరిక ఉన్నప్పుడు మీమ్స్ చూసేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు.

 Indians Spending 30 Minutes In A Day To See Memes Details, Day, 30 Mints , Mems,-TeluguStop.com

ఈ విషయాన్ని స్ట్రాటజీ కన్సల్టింగ్ సంస్థ నివేదికలో పేర్కొంది.స్ట్రాటజీ కన్సల్టింగ్ సంస్థ రెడ్ సీర్ సోమవారం ఒక నివేదికను విడుదల చేసింది.

ఈ నివేదిక ప్రకారం భారతీయులు రోజులో 30 నిమిషాలు మీమ్స్ చూస్తున్నారు.ఒత్తడిని తగ్గించుకోవడానికి చాలా మంది మీమ్స్ ని మంచి మాధ్యమంగా చూస్తున్నారని నివేదికలో పేర్కొంది.

మీమ్స్ పట్ల భారతీయుల వైఖరి మారిపోయిందని, మీమ్స్ పై వారు ఆసక్తి చూపిస్తున్నారని నివేదికలో వెల్లడైంది.80 శాతం మంది ప్రజలు మీమ్స్ చూడటానికి తమ సమయాన్ని వెచ్చించారనే అంచనా వేసింది.రెడ్ సీర్ లో భాగస్వామి అయిన మృగాంక్ గుట్ గుటియా ప్రకారం, మీమ్స్ ని ఎక్కువ మంది షేర్ చేస్తున్నారని, గత ఏడాదిలో 80 శాతం మంది ప్రజలు మీమ్స్ వినియోగాన్ని పెంచుకున్నారు.ఎంటర్ టైన్మెంట్ రంగంలో మీమ్స్ కి ఆదరణ పెరిగింది.

దీంతో మీమ్స్ క్రియేషన్ ప్లాట్ ఫారమ్ లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

Telugu Minutes Day, Indians, Memes, Mems, Red Seer, Latest-Latest News - Telugu

90 శాతం మంది వినియోగదారులు మీమ్స్ రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నారు.దీనిని బట్టి మీమ్స్ క్రియేషన్ యాప్స్ కి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.బ్రాండ్ బిల్డింగ్ కోసం, సృజనాత్మక అవుట్ లెట్ గా మీమ్స్ వినియోగించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఏ వ్యక్తి అయినా వాటిని కనెక్ట్ చేయగలడు, ఇది బ్రాండ్ బిల్డింగ్, మార్కెటింగ్ కి బాగా ఉపయోగపడుతుంది.తక్కువ వ్యవధిలోనే మీమ్స్ కి ఇంత ప్రజాదరణ పొందడానికి ఇది కారణమని నివేదికలో వెల్లడైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube