ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో తెలుగువారి ప్రమేయం ఎంతో ఉన్నదని సిబిఐ వర్గాలు తెలిపాయి.ఈ వ్యవహారంపై అనేక విషయాలు బయటకు వస్తాయని అప్పుడు తెలుగు వారి పేర్లు కూడా ముందుకు వస్తాయని సిబిఐ అధికారి ఒకరు తెలిపారు.
హైదరాబాద్ సహా దేశంలో 31 ప్రాంతాల్లో దాడులు జరిపిన సిబిఐ అధికారులు మధ్య కుంభకోణలో సంబంధం ఉన్న ఐదుగురుని తన కార్యాలయానికి పిలిచి గోప్యంగా విచారణ జరిపింది.సిబిఐ దాడులతో ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ జనతా పార్టీల మధ్య వివాదం తీవ్రతరమైంది.
సిబిఐ ఈడి దాడుతో తమను భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ అన్నారు.మద్యం వ్యాపారంలో ఎలాంటి కుంభకోణం లేదని ఆయన చెప్పారు.
పంజాబ్ ఎన్నికల్లో ఆఫ్ విజయం తర్వాత రోజురోజుకు పెరుగుతున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రజల ఆదరణ చూసి ప్రధాని మోడీ భయపడుతున్నందువల్లే సిబిఐని ప్రయోగించారని ఆయన చెబుతున్నారు.నిజానికి ఢిల్లీ ప్రభుత్వం మద్యం విధానం ఈ దేశంలో కెల్లా ఉత్తమమైన విధానమని దాని పారదర్శకంగా అమలు చేశామని ఆయన అంటున్నారు.
మద్యం విధానాన్ని విఫలం చేయాలని ఉద్దేశంతోనే లెఫ్టినెంట్ గవర్నర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని.లేకపోతే ఢిల్లీ ప్రభుత్వం ఏటా పదివేల కోట్లు అర్జించేదని తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కేవలం విద్యామంత్రిగా ఉన్నానని చెబుతున్నారు.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని తిప్పికొట్టేందుకు బిజెపి పార్టీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.మద్యం కుంభకోణం సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ అని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు.
ఇది చాలా పెద్ద కుంభకోణం అని జరిగిన పరిణామాలతో మనీష్ నివ్వేర పోయారని చెప్తున్నారు.ఢిల్లీ ప్రభుత్వం మధ్య విధానం సరైనదైతే శివే విచారణకు ఆదేశించిన రోజే దాన్ని ఎందుకు వెనక్కు తీసుకున్నారని ప్రశ్నించారు.
మద్యం డీలర్ల పట్ల ఎందుకు మెతకగా వ్యవహరించారు.ఉత్పత్తి కంపెనీలను మద్యం అమ్మడానికి ఎందుకు అనుమతించారు… మద్య మాఫియాకు 144 కోట్లు రాయితీలను ఎందుకు ఇచ్చారు.బ్లాక్ లిస్ట్లో పెట్టిన కంపెనీలకు మద్యం అమ్మేందుకు ఎందుకు అనుమతించారు.ఎఫ్ ఐ ఆర్ లో ప్రధాన నిందితుడైన మనీష్, ఇతర నిందితులకు సంబంధం ఏంటి.
కేజ్రీవాల్ ప్రభుత్వం బాధ్యతలు ప్రశ్నల నుంచి తప్పించుకుంటుందని వ్యాఖ్యానించారు.

ఆఫ్ ఉచితాలు తాగుబోతుల సర్కార్ అని చెప్పారు.మధ్య వ్యాపారులతో మనీష్ ఎందుకంత స్నేహంగా ఉన్నారని ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు అదేష్ గుప్తా ప్రశ్నించారు.బిజెపి పాలనలో ఉన్న మునిసిపల్ కార్పొరేషన్ కూడా 85 కోట్ల మేర టోల్ లైసెన్స్ ఫీజును మాఫీ చేసిందని ఆఫ్ నేతలు ప్రస్తావించారు.
సిబిఐ ఈడీలు వాటిని ఎందుకు దర్యాప్తు చేయడం లేదని వారు ప్రశ్నించారు.ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఇంటిపై దాడులు చేసిన తరువాత ఏం దొరికిందో సిబిఐ ఇంకా చెప్పలేదని ఆఫ్ నేతలు చెబుతున్నారు.
కేజ్రీవాల్ ఎదుగుదలను తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం సిబిఐని ప్రయోగించిందని సమాజ్ వాది ఎంపీ కపిల్ సిబల్ విమర్శించారు.మనీష్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహమ్మద్ డిమాండ్ చేశారు.
ఈ కుంభకోణం గురించి తాము జూలైలోనే పోలీసులకు ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

సిబిఐ దాడుల నేపథ్యంలో ఢిల్లీ సర్కారుల్లోని 12 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ ఉత్తర్వులు ఇచ్చారు.ఢిల్లీలో మద్యం దుకాణంలో కేవలం 7% మాత్రమే తమ కంపెనీలకు ఉన్నాయని బాలాజీ గ్రూప్ అధినేత, ఒంగోలు ఎంపీ మాగోంటి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు.మిగతా 93% ఇతర కంపెనీల చేతుల్లో ఉన్నాయన్నారు.
ఢిల్లీ మధ్య వ్యాపారాన్ని తాను మిగతా కంపెనీలుగా కర్టేల్ గా ఏర్పడి నిర్వహించామన్న వార్తల్లో నిజం లేదన్నారు.మద్యం కుంభకోణంలో తన ప్రమేయం లేదని చెబుతున్నారు.
మొత్తం 32 జోన్లలో తనకు కేవలం రెండు జోన్లలో వ్యాపారం దక్కిందన్నారు.ఢిల్లీ మద్యం వ్యాపారంలో తాను లాభాలు ఆశించలేదని చెబుతున్నారు.
నిజానికి తనకు నష్టమే జరిగిందన్నారు.సగం రేట్లకే మద్యం అమ్మాల్సి రావడం వల్ల అటు వినియోగదారులు, ఇటు ఢిల్లీ ప్రభుత్వం లాభపడ్డాయని మధ్యలో తనలాంటి వ్యాపారుల నష్టపోయారని చెప్పుకొచ్చారు.
సిబిఐ ఎఫ్ఐఆర్లో తన పేరును చేర్చలేదని మాగుంట గుర్తు చేశారు.







