బింబిసార ఓటిటి పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే?

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామా ‘బింబిసార’. ఈ సినిమాను యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడితెరకెక్కించారు.

 Bimbisara Movie Ott Release Date And Platform Locked Details, Kalyan Ram , Bimbi-TeluguStop.com

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఆయన కెరీర్ కు బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి.

అలాగే టాలీవుడ్ కష్టకాలంలో ఉండగా ఆ పరిస్థితులను మార్చి మళ్ళీ బాక్సాఫీస్ కళకళ లాడేలా చేయడంలో బింబిసార కూడా తోడ్పడింది.ఆగష్టు మొదటి వారం వచ్చిన ఈ సినిమా కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

జులై నెల మొత్తం బాక్సాఫీస్ వెలవెల బోయింది.వరుస ప్లాప్స్ తో సందడి లేకుండా పోయింది.

మరి అలాంటి సమయం లోనే బింబిసార కూడా రిలీజ్ అయ్యింది.అయితే ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చడంతో బ్లాక్ బస్టర్ హిట్ చేసారు.

ఈ సినిమా వసూళ్ల పరంగా టాలీవుడ్ స్టార్ హీరోలను సైతం ఆశ్చర్య పరిచింది.

Telugu Bimbisara, Bimbisara Ott, Catherine Tresa, Vasisth Malladi, Kalyan Ram, O

రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్న ఇప్పటికి థియేటర్స్ లో డీసెంట్ రన్ కనబరుస్తూ మంచి వసూళ్లు సాధిస్తుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటిటి పార్ట్నర్ గురించి సమాచారం బయటకు వచ్చింది.

ఈ సినిమాను ప్రముఖ ఓటిటి సంస్థ జీ5 దక్కించు కున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమా స్ట్రీమింగ్ కు అయితే ఇంకా కొద్దీ సమయం ఉంది.ఎందుకంటే టాలీవుడ్ సినీ పెద్దలు అందరు కలిసి 8 వారాల తర్వాతనే ఓటిటిలో రిలీజ్ చేయాలనీ నిర్ణయించిన విషయం తెలిసిందే.

దీంతో బింబిసార సినిమా 50 రోజుల తర్వాతనే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇదీ ఒకందుకు మంచిదే అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube