జంతువులు మనుషుల లాగా మాట్లాడలేవు కానీ వాటికి ట్రైనింగ్ ఇస్తే చాలా పనులు సమర్థవంతంగా చేయగలవు.ఈ జంతువులు మనుషుల కంటే మరింత పర్ఫెక్ట్‌గా, త్వరగా కూడా పనులను నేర్చుకోగలవు.
వీటిలో కోతులు, చింపాంజీలు ముందుంటాయి.అందుకే చింపాంజీలను ప్రజలు పెంచుకుంటుంటారు.
వీటి స్మార్ట్‌నెస్ చూసి ముచ్చట పడుతూ ఉంటారు.రకరకాల యాక్టివిటీలు నేర్పించి ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తుంటారు.
అయితే ఒక యజమాని తన చింపాంజీకి జ్యూస్ ప్యాకెట్ లేదా పాలడబ్బా నుంచి పాలను స్ట్రాతో ఎలా తాగాలో నేర్పించాడు.దాంతో అది స్ట్రాకి ఉన్న వ్రాపర్ తనంతట తానే తీసుకొని.
పాలడబ్బాకి హోల్ పెట్టి. అందులో స్ట్రా వేసుకొని ఎంచక్కా తాగింది.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా రకరకాల సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.దీనిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.“వావ్ సూపర్, ఇది అమేజింగ్, కొందరు మనుషుల కంటే ఇదే చాలా తెలివైనది.” అని కామెంట్స్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే.మనం మొదటగా ఒక చింపాంజీ కిరాక్ ఆర్పీ లాగా తన రెండు కాళ్లను కలిపి ఠపీమని కొట్టడం చూడవచ్చు.

తర్వాత యజమాని దానికొక పాలడబ్బా అందించాడు.అది తీసుకున్న ఆ చింపాంజీ చాలా వేగంగా పాలడబ్బాకి అటాచ్ చేసి ఉన్న స్ట్రాను బయటికి తీసింది.ఆ తర్వాత దాని చుట్టూ ఉన్న కవర్‌ను తొలగించింది.ఆపై స్ట్రాతో పాలడబ్బాకి కరెక్ట్ గా చేయాల్సిన చోట రంధ్రం చేసింది.అనంతరం ఆ రంధ్రంలో స్ట్రా పెట్టి జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేసింది.దీని తెలివికి ఆ యజమాని ఆశ్చర్యపోయాడు.
నెటిజన్లు కూడా ఇది చాలా తెలివైన చింపాంజీ అని కామెంట్స్ చేస్తున్నారు.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.
@







