డబ్బింగ్ సినిమాల మీద పడ్డ హీరో హోం ప్రొడక్షన్‌ కంపెనీ

యంగ్ హీరో నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ లో వరుసగా డబ్బింగ్‌ సినిమా లు వస్తున్నాయి.ఆ మధ్య కమల్‌ హాసన్ నటించిన విక్రమ్‌ సినిమా ను తెలుగు లో విడుదల చేసిన విషయం తెల్సిందే.

 Nitin Home Banner Dubbing One More Tamil Film In Telugu That Called Arya's Capta-TeluguStop.com

నితిన్ కు కమల్‌ హాసన్‌ అంటే చాలా ఇష్టం.ఆ కారణం తోనే తన తండ్రి తో ఆ సినిమా ను డబ్బింగ్‌ రైట్స్ తీసుకునేలా ఒప్పించాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమా తో నితిన్ బ్యానర్ కి మంచి లాభాలు వచ్చాయి.దాదాపుగా పది కోట్ల కు పైగానే ఆ సినిమా ద్వారా లాభం వచ్చి ఉంటుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఆ సినిమా తో వచ్చిన లాభాలు నితిన్‌ నటించిన మాచర్ల నియోజక వర్గం తో పోయి ఉంటాయి.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం లో రూపొందిన మాచర్ల నియోజక వర్గం సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

ఆ సినిమా డిజాస్టర్‌ టాక్ దక్కించుకున్న నేపథ్యం లో భారీ గానే లాస్ వచ్చి ఉంటుంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు కెప్టెన్ అనే సినిమా ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి భారీ మొత్తానికి హక్కులను కొనుగోలు చేయడం జరిగిందట.

ఆర్య హీరోగా రూపొందిన ఒక భారీ యాక్షన్ డ్రామా సినిమా కెప్టెన్‌.హాలీవుడ్‌ రేంజ్ లో గ్రాఫిక్స్ మరియు యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమా లో ఉంటాయి అంటూ తాజాగా విడుదల అయిన ట్రైలర్‌ ను చూస్తూ ఉంటే అనిపిస్తుంది.

తప్పకుండా ఈ సినిమా భారీ ఎత్తున విజయాన్ని సొంతం చేసుకుంటుందని.హాలీవుడ్‌ సినిమా లను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చతుందని అంటున్నారు.

అందుకే తెలుగు డబ్బింగ్‌ రైట్స్ ను నితిన్‌ కొనుగోలు చేయించాడు అంటూ సమాచారం అందుతోంది.మరో వైపు నితిన్ ఒక సినిమా ను చేస్తున్నాడు.

వచ్చే ఏడాది ఆరంభం లో ఆ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube