తమిళ ప్రముక దర్శకుడు లింగు స్వామి మాస్ సినిమా ల దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.తెలుగు లో సూపర్ హిట్ అయిన పందె కోడి సినిమా తో పాటు మరి కొన్ని సినిమా లు కూడా ఆయన దర్శకత్వం లో వచ్చినవే.
భారీ అంచనాల నడుమ రూపొందిన ది వారియర్ సినిమా ను కూడా ఆయనే రూపొందించిన విషయం తెల్సిందే.రామ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా రూపొంది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది వారియర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని భావిస్తే బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.అయితే రామ్ కి ఒక మంచి మాస్ సినిమా అంటూ మాత్రం వార్తలు వచ్చాయి.
ఇప్పుడు లింగు స్వామి తదుపరి సినిమా విషయంలో చర్చలు జరుపుతున్నాడు.ఈ సమయంలో ఒక చెక్ బౌన్స్ కేసులో ఏకంగా ఆరు నెలల జైలు శిక్ష పడింది.
తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి తనకు లింగు స్వామి చెల్లని చెక్కు ఇచ్చాడు అంటూ ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు లో లింగు స్వామి తప్పు చేశాడు అంటూ నిరూపించారు.
దాంతో కేసు విచారణ కు వచ్చింది.తుది తీర్పు వెలువడింది.
లింగు స్వామి మరియు ఆయన సోదరుడు చెక్ బౌన్స్ కేసు లో నిదింతులుగా నిరూపితం అయ్యారు.దాంతో దోషులుగా తేలిన లింగు స్వామి బ్రదర్స్ కి ఏకంగా ఆరు నెలల జైలు శిక్ష ను కోర్టు విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది.
ఈ కేసు విషయం ప్రస్తుతం సోషల్ మీడియా లో ప్రథానం గా చర్చ జరుగుతోంది.లింగు స్వామి గతంలో ఒక సినిమా నిర్మానం లో భాగస్వామి అయ్యాడు.
ఆ సమయంలో ఈ చెల్లని చెక్కు ఇచ్చాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.ఈ కేసు విషయం లో లింగు స్వామి బ్రదర్స్ ఉన్నత న్యాయ స్థానం కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.








