జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాకూడదని తెలిపారు.
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమని స్పష్టం చేశారు.వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు ఏ విధంగా అయినా ముందుకు వెళ్తానని తెలిపారు.
మా వ్యూహాలు మాకు ఉన్నాయి.అప్పుడు ఆ సందర్భం బట్టి.
మార్చుకుంటామని స్పష్టం చేశారు.మా వ్యూహాలు మాకు ఉంటాయి ఎప్పుడు ఎలా వెళ్లాలో అప్పుడు చెబుతాను.
ఇప్పుడే ఏమీ బయటకు చెప్పలేమ్.
ఏదిఏమైనా వైసీపీ వ్యతిరేక ఓటును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చిల్చం.
సమయం బట్టి వ్యూహం ప్రకటిస్తాం అని తనదైన శైలిలో… పవన్ స్పీచ్ ఇచ్చారు.వైసీపీ అధికారంలోకి వచ్చాక బడుగు బలహీన వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
ఇటీవల రాయలసీమ పర్యటన చేపట్టిన టైంలో అక్కడ పరిశ్రమ పెట్టాలంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది అని అక్కడ వాళ్ళు చెప్పినట్లు పవన్ చెప్పుకొచ్చారు.ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి రాకూడదని ఆ దిశగానే తాను వ్యవహరిస్తున్నట్లు పవన్ చెప్పకోచ్చారు.







