వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారులు ఒకసారిగా దూకుడు పెంచారు .ఈ వారంలో కీలకమైన ముందడుగు వేయడానికి సిద్ధమైందని ఏదో ఒక సంచలనం అయితే ఖాయం అంటూ.
అటు పోలీసు వర్గాల్లో.ఇటు రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతుంది.
అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ హుటా హుటిన ఢిల్లీ వెళ్లారు.ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు.
ఈ రెండింటికి పరస్పర సంబంధం ఉందా .అనే కోణంలో రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.గత అనుభవాలు చూసిన ఎవరికైనా అనిపిస్తుందని అంటున్నారు.ఈ హత్య కేసును రాష్ట్ర పోలీసుల డీల్ చేసినప్పటికీ తర్వాత సిబిఐ కి ఇవ్వాల్సి వచ్చింది.వివేక కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది.ఓ మహిళ ఐపీఎస్ ఆధ్వర్యంలో సిబిఐ దర్యాప్తు చేపట్టింది.
అయితే సమర్థ అధికారినిగా పేరు తెచ్చుకున్న ఆమె పదోన్నతపై బదిలీ అయ్యారు.ఆమె స్థానంలో వచ్చిన సిబిఐ అధికారులను కూడా పనిచేయనియవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు అడుగడుగునా అడ్డుపడుతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి.
ఏకంగా సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైనే రాష్ట్ర పోలీసుల కేసు నమోదు చేయడం దీనికి నిదర్శనం.దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.ఆ కేసులో ఏపీ పోలీసుల ద్వారా జగన్ ప్రభుత్వమే కౌంటర్ వేస్తుంది.సిబిఐ అధికారులను బెదిరించడం ద్వారా హత్య కేసును కొలిక్కి రాకుండా చేయడమే ప్రభుత్వం పెద్దలు ఉద్దేశం అన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఆ మధ్య ఇదే కేసులో సిబిఐ అధికారులు తమ సంపాదించిన ఆధారాలతో ఒక కీలక వ్యక్తిని అరెస్టు చేయబోతున్నారని విస్తృత ప్రచా రాలు వచ్చాయి.
ఏ క్షణమైన ఆయన అరెస్టు జరగచ్చని వివేక హత్య కేసు దాదాపు కొలిక్కి వచ్చినట్లేనని అనుకుంటున్నా సమయంలో జగన్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లారు.అయితే సిబిఐ అధికారులు పట్టు వదలని విక్రమార్కుల్లా మరికొంత అదనపు సమాచార సేకరించారని ఈ వారంలో కేసు కీలకమైన తిరగబోతుందని సరికొత్త పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని వర్గాలు అంతర్గతంగా చర్చ జరుగుతుంది.సరిగ్గా ఇదే సమయంలో జగన్ మళ్ళీ ఢిల్లీ వెళ్లారు.
ఇప్పుడు అదే సీన్.పునరావృత్తం అవుతుందా ఇదే ఇప్పుడు చర్చ.
ఏ క్షణమైన అరెస్టులు జరగవచ్చు అన్న నేపథ్యంలో జగన్ గతంలో ఢిల్లీ పెద్దలను కలవడం అవి ఆగిపోవడం చూస్తే ఢిల్లీ యాత్రలోనూ అలాంటిదే ఉంటుందా? ఒకవేళ అందరూ భావించినట్లుగా ఈ వారం వైపు నుంచి ఎలాంటి పురోగతి లేకపోతే ఆయన హస్తినా యాత్ర విజయవంతమైన అన్ని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి పోలవరం నిధులు ప్రత్యేక హోదా యువజన హామీలు అమలు అడుగుతారని ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేస్తున్నారు.ఇప్పుడు అంతే.ప్రధానిని కలిసి రాష్ట్ర అంశాలపై గట్టిగా మాట్లాడుతారని అధికార పక్షం చెబుతుంది.
అయితే అవి ఏంటనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది.జగన్ ఢిల్లీ టూర్ ఫలితాలు ఈ వారంలోనే వెలుగు చూడడం ఖాయమని అటు పోలీసులు.
ఇటు కుటుంబ సభ్యులకు కూడా భావిస్తున్నారు.సిబిఐ ముందడుగు వేయకపోతే మాత్రం జగన్ ఢిల్లీ వెళ్ళింది ఈ పని మీదనని తేలిపోతుందని అంటున్నారు.