ఏపీ ప్రభుత్వంపై విమర్శలు జోరు పెంచిన బిజెపి నాయకులు ఇప్పుడు దానిని మరింత ఉధృతం చేశారు.ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మొదటి నుంచి వైసీపీకి అనుకూలంగా మాట్లాడేవారు.
దీంతో ఆయనపై వైసిపి అనుకూల ముద్ర పడింది.అయితే దీనికి భిన్నంగా గత కొద్ది రోజులుగా సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వం ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు తీవ్రతరం చేశారు.
కేంద్ర బిజెపి పెద్దల వైకిరి వైసిపి పై మారడంతో వీర్రాజు కూడా విమర్శలతో విరుచుకుపడుతున్నారు.ఇక కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం జగన్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు.
మాఫియాలు ఏపీలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి అంటూ ఆయన మండిపడ్డారు. ఏపీ పర్యటనలో భాగంగా బీజేవైఎం యువ సంఘర్షణ యాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఆయన వైసీపీ ప్రభుత్వంను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేశారు.
జగన్ రెడ్డి ఇప్పటికైనా గంజాయి నుంచి విముక్తి కల్పించాలని కోరారు.లేకపోతే యువత మిమ్మల్ని మింగేస్తుందని ఆయన హెచ్చరించారు.త్రిపురలో ఒక్క సీటు లేకపోయినా బిజెపి జెండా ఎగరవేసిందని ,ఏపీలోనూ బిజెపి తరహాలోని బిజెపి జెండా ఎగురుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు.ఇద్దరు ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చినా, అక్కడ వలసలు ఆపలేకపోతున్నారని, ఏపీ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తున్నా, వాటిని సరిగా అమలు చేయడం లేదని సోమ వీర్రాజు మండిపడ్డారు.
ఏపీలో అప్పులు 97 వేల కోట్ల నుంచి నాలుగు లక్షల కోట్లకు పెరిగాయని మండిపడ్డారు.తుగ్లక్ తరహాలో జగన్ మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చాయన్నారు.

ఏపీలో త్వరలోనే కీలక పరిణామాలు జరగబోతున్నాయంటూ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎవరు ఊహించని విధంగా ఏపీలో పరిణామాలు చోటు చేసుకుంటాయని బిజెపి అధినాయకత్వం ఏపీ విషయంలో అత్యంత కీలక నిర్ణయం తీసుకోబోతుందంటూ వీర్రాజు ఉత్కంఠ కలిగించే వ్యాఖ్యలు చేశారు ఎవరికీ భయపడని జగన్ ఒక మోదీ కి మాత్రమే భయపడతారని వీర్రాజు ఎద్దేవా చేశారు.వైసీపీని గద్దె దించేది బిజెపి నే అని ధీమా వ్యక్తం చేశారు.అయితే వీర్రాజు వ్యాఖ్యలపై సర్వత్ర ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.వీర్రాజు చెబుతున్నట్లుగా త్వరలో కీలక పరిణామాలు ఏమిటి అనే విషయంపై అంతా ఆరా తీస్తున్నారు.ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే.2024 లోను ఇదే పరిస్థితి ఉండబోతోంది.పైగా జనసేనతో పొత్తు కూడా రద్దయ్య అవకాశాలు ఉన్నాయి.
వీర్రాజు చెబుతున్నట్లుగా టిడిపితో బిజెపి పొత్తు పెట్టుకోవడమే ఆ ఊహించని పరిణామమా అనే అనుమానాలు కలుగుతున్నాయి.







