వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఇప్పుడు కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.రాజకీయాల్లోనూ రాణిస్తూ పలు కీలక పదవులను సొంతం చేసుకుంటున్నారు.
అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాలలో భారతీయుల ప్రాబల్యం ఎక్కువగా వున్న సంగతి తెలిసిందే.అక్కడి ఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపొటములను మనవాళ్లే నిర్ణయిస్తున్నారు.
తాజాగా కెనడాలోని బ్రాంప్టన్ మున్సిపల్ ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్ధులు భారీగా బరిలో నిలిచారు.ఏకంగా 40 మంది పంజాబీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
అక్టోబర్ 24న ఎన్నికలు జరగనున్నాయి.వీరిలో మేయర్ పదవి కోసం నిక్కీ కౌర్, ప్రభ్ కౌర్ మాండ్, బాబ్ సింగ్ మధ్య ఆసక్తికరమైన పోరు నెలకొంది.
వార్డ్ నెంబర్ 9, 10లపై పంజాబీలకు ప్రత్యేక ఆసక్తి వుంది.ఇక్కడ బరిలో నిలిచిన 11 మంది అభ్యర్ధులలో తొమ్మిది మంది పంజాబీ మూలాలున్న వారే.జగదీశ్ సింగ్ గ్రేవాల్, మహేంద్ర గుప్తా, మన్ ప్రీత్ ఓథీ, హర్కీరత్ సింగ్, అనీప్ ధాడే, గురుప్రీత్ సింగ్ ధిల్లాన్, ఆజాద్ సింగ్, గగన్ లాల్ , గురు ప్రతాప్ సింగ్ టూర్‌లు ఇక్కడ పోటీ చేస్తున్నారు.వార్డ్ నెంబర్ 9, 10ల పరిధిలోని పీల్ డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్ ట్రస్టీ పదవికి రాబీ బస్సీ, తరణ్‌వీర్ ధాలివాల్, యద్విందర్ గోసల్, సత్పాల్ సింగ్ జోహల్ పోటీలో వున్నారు.
వార్డ్ నెంబర్ 1, 5 లలో హర్షమీత్ ధిల్లాన్, కపిల్ ఓం ప్రకాష్‌లు నగర కౌన్సిల్‌కు పోటీ పడుతుండగా.సీమా పాసి ప్రాంతీయ కౌన్సిల్‌కు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఇక్కడి నుంచి ట్రస్టీ, పీల్ డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డుకు హర్ పర్మీందర్ సింగ్ గాద్రీ, షాజిందర్ పెద్దా పోటీ పడుతున్నారు.

వార్డ్ నెంబర్ 2, 6ల నుంచి నగర కౌన్సిల్‌కు నవజిత్ కౌర్ బ్రార్, హర్దీప్ సింగ్, ప్రాంతీయ కౌన్సిల్‌కు బబితా గుప్తా, గురుప్రీత్ సింగ్ పబ్లా పోటీ చేస్తున్నారు.పీల్ డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్ ట్రస్టీ పదవికి నిర్పాల్ సెఖోన్ బరిలో నిలిచారు.వార్డ్ నెంబర్ 3, 4 నుంచి జస్మోహన్ సింగ్ మంకూ, తేజేశ్వర్ సోయిన్ నగర కౌన్సిల్‌కు పోటీపడుతుండగా.
అమీక్ సింగ్ ప్రాంతీయ కౌన్సిల్‌కు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.పీల్ డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్ ట్రస్టీ పదవికి రంజిత్ సింగ్ ధాలివాల్ పోటీపడుతున్నారు.







