తెలుగు సినిమాలలో సహాయ పాత్రలలో నటిస్తూ తనకంటూ క్రేజ్ అందుకున్న నటి ప్రగతి. ఎక్కువగా తల్లి, అత్త పాత్రలలో నటిస్తూ తన మాటలతో బాగా ఆకట్టుకుంటుంది.
అంతేకాకుండా అతిథి పాత్రల్లో కూడా మెప్పించింది.ఏమైంది ఈ వేళ సినిమా లో హీరో తల్లిగా చేసిన పాత్రకు మంచి గుర్తింపు అందుకొని ఉత్తమ సహాయ నటిగా అవార్డు కూడా అందుకుంది.
తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు అందుకుంది ప్రగతి.ప్రస్తుతం పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బాగా బిజీగా ఉంది.ఇదంతా పక్కన పెడితే.సోషల్ మీడియా ప్రభావం ప్రగతి పై ఎక్కువగానే ఉంది.
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఎప్పటికప్పుడు తన ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది.
ఆ ఫోటోలు కూడా బాగా వైరల్ గా మారుతుంటాయి.అంతే కాకుండా ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న అభిమానులు కూడా అంతా ఇంతా కాదనే చెప్పవచ్చు.ఇప్పటికే తన వయసును కనబడకుండా తన అందంతో కప్పివేస్తుంది.ఎన్నో సినిమాలలో నటించిన ప్రగతికి సోషల్ మీడియా ద్వారానే ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పవచ్చు.
తనకు ఇద్దరు పిల్లలు కూడా ఉండగా.తన గ్లామర్ ను మాత్రం పెంచుకుంటూ పోతుంది.అంతే కాకుండా తను వేసే డ్రెస్సులు కూడా యంగ్ హీరోయిన్స్ ని మించి ఉంటాయి.ఇక తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా తెరిచి చూస్తే చాలు.ఎన్నో డాన్స్ స్టెప్ లతో తెగ రచ్చ చేస్తూ ఉంటుంది.అసలు ఈ వయసులో కూడా ఇంత ఫిట్ గా ఉన్న ప్రగతిని చూసి అభిమానులు తెగ షాక్ అవుతున్నారు.
ఎందుకంటే ఆమె ప్రతిరోజు వర్కౌట్లు చేస్తూ మంచి ఫిజిక్ ను సంపాదించుకుంది.ఇక అప్పుడప్పుడు బుల్లితెరపై జరిగే ఈవెంట్లలో కనిపిస్తూ సందడి చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈటీవీ మల్లెమాల వినాయక చవితి సందర్భంగా మా ఊరి వినాయకుడు అనే ఈవెంట్ ను నిర్వహించారు.
ఇక అందులో పలువురు సీనియర్ నటినటులతో పాటు బుల్లితెర ఆర్టిస్టులు పాల్గొని బాగా సందడి చేశారు.ఇందులో నటి ప్రగతి కూడా పాల్గొని తన డాన్స్ తో అందరినీ షాక్ అయ్యేలా చేసింది.
ఇక హైపర్ ఆది కూడా ఉండగా ఆయన వేసే పంచుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఒక స్కిట్ లో భాగంగా హైపర్ ఆది.ప్రగతిని చూపిస్తూ. మనవళ్లకు టీకాలు వేయించాల్సిన వయసులో ఈ టాటూలు ఏంటి నాయనమ్మ అంటూ షాక్ ఇచ్చాడు.అంతేకాకుండా కొడుకులను పెంచక కండలను పెంచుతుంది అంటూ ప్రగతి పరువు తీసేశాడు.
దీంతో అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు.ప్రస్తుతం ఈ ప్రోమో బాగా వైరల్ అవ్వగా ఈ ఎపిసోడ్ కోసం వేయిటింగ్ అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.