హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరగనున్నాయి.ఈ నేపథ్యంలో వేడుకలు అందరికీ గుర్తిండి పోయే విధంగా నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు.
కాగా, సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీల, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులకు ఆహ్వానాలు అందజేశారు.అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం పంపారు.
ముగింపు వేడుకల నేపథ్యంలో ఎల్బీ స్టేడియాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి, సీనియర్ అధికారులతో కలిసి సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు.ముందుగా ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రతి జిల్లా నుంచి ఎల్బీ స్టేడియానికి ప్రత్యేక బస్సు లు ఏర్పాటు చేశామన్నారు.అదేవిధంగా తెలంగాణ జానపద కార్యక్రమాలు, లేజర్ షో ఉంటాయని సీఎస్ చెప్పారు.
బాణసంచా కాల్చడంతో పాటు దేశ స్వాతంత్య్ర పోరాటం, దేశభక్తి ప్రధానంగా కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు.







