ఆ రాష్ట్ర మహిళలకు గుడ్‌న్యూస్.. ఫ్రీగా ఫోన్లు, ఫ్రీగా మూడేళ్లు ఇంటర్నెట్..

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సర్కార్ డిజిటల్ సేవా యోజన పథకం కింద మహిళలకు కళ్లు చెదిరే ఆఫర్ తీసుకొచ్చింది.ఆడవారికి ఫ్రీగా స్మార్ట్‌ఫోన్లు, మూడున్నర ఏళ్ల పాటు ఉచిత ఇంటర్నెట్ అందిస్తామని ప్రకటించింది.రాజస్థాన్‌లో 1.35 కోట్ల మంది మహిళలు ఉన్నారు.వారందరికీ కూడా ఫ్రీగా ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులు వెల్లడించారు.ఇందుకు రూ.12వేల కోట్లు ఖర్చు కానుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

 Rajasthan Government Digital Seva Yojana Scheme 2022 Details, Women's, Good New-TeluguStop.com

డిజిటల్ సేవా యోజన పథకం కింద చిరంజీవి ఆరోగ్య బీమా పథకంలో చేరిన 1.35 కోట్ల కుటుంబాల మహిళా పెద్దలకు మూడేళ్లపాటు ఇంటర్నెట్ కనెక్టివిటీతో స్మార్ట్‌ఫోన్లను అందిస్తారు.నిజానికి డిజిటల్‌ సేవా యోజన పథకాన్ని 2022 బడ్జెట్‌లోనే ప్రకటించారు.

ఉచితంగా ఫోన్లను అందజేసేందుకు, ఇంటర్నెట్ అందించేందుకు టెలికాం సంస్థల నుంచి బిడ్లను ప్రభుత్వం ఆహ్వానించింది.ఈనెల చివరిలోగా బిడ్లను ఫైనలైజ్ చేయనున్నారు.2023లో రాష్ట్రంలో ఎలక్షన్స్ జరగనున్నాయి.అందుకే ప్రభుత్వం ఈ ‘ఉచిత’ స్కీమ్‌కు తీసుకొచ్చినట్టు స్పష్టమవుతోంది.

Telugu Phone, Rajasthan, Womens-Latest News - Telugu

ఉచితంగా అందించే ఫోన్లలో మొదటి సిమ్‌కార్డు లాక్‌ చేసి ఉంటుందట.వీటిని పొందిన మహిళలు రెండో సిమ్‌ స్లాట్‌లో సిమ్‌ కార్డు వేసుకునే వీలుంటుంది.ఈ ఉచిత సేవలు, ఫోన్స్‌ రాష్ట్ర మహిళలకు అందజేయడానికి ప్రభుత్వం మూడు ప్రైవేటు టెలికాం కంపెనీలతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ తో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.ఈ నాలుగు కంపెనీలు కూడా బిడ్ దక్కించుకునేందుకు అంటే కృషి చేస్తున్నాయట.ఎందుకంటే ఈ టెండర్‌ తగ్గితే ఒకేసారి 1.35 కోట్ల యూజర్లను పొందొచ్చు.దీని వల్ల ఎంతగానో లాభాలు పొందొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube