టెక్నాలజీ కాలంలో స్మార్ట్ ఫోన్ యగంలో ప్రస్తుతం మనం కొనసాగుతున్నాం.ఏది తెలుసుకోవాలన్నా.
ఏది కావాలన్నా సరే నిమిషాల్లో మన ముందు ఉంటుంది.ప్రపంచం మొత్తం మన అరచేతుల్లోకి వచ్చేసింది.
ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతన్నాం.టెక్నాలజీ వల్ల ఇంటి నుంచి బయటికి వెళ్లే పని లేకుండా పనలన్నీ జరిగిపోతున్నాయి.
అయితే టెక్నాలజీ వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో.నష్టాలు కూడా అంతే ఉన్నాయి.
మంచి పనులకు ఉపయోగించుకుని కొంతమంది లాభ పడతుంటే.మరికొంతమంది చెడు పనులకు ఉపయోగిస్తున్నారు.
అయితే టెక్నాలజీ వల్ల వ్యక్తులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం సులువుగా అయిపోయింది.ఈజీగా ట్రాక్ చేయగలుగుతున్నాం.ముఖ్యంగా గూగుల్ మ్యాప్స్ ద్వారా వ్యక్తుల లొకేషన్ ను ట్రాక్ చేయవచ్చు.వాళ్లు ఎక్కడికి వెళుతున్నారో కూడా తెలుసుకోవచ్చు.
కాకపోతే దానికి ఎదుటివంటి పర్మిషన్ ఉండాలి.ఇప్పుడు మీకు కావాల్సిన వ్యక్తి లొకేషన్ ను ఎలా ట్రాక్ చేయాలో తెలుసుకుందాం.

ఆండ్రాయిడ్ ఫోన్ లో అయితే వాట్సప్ లో లైవ్ లొకేషన్ షేర్ చేస్తే ఒక వ్యక్తి మరో వ్యక్తిని ట్రాక్ చేయవచ్చు.ఇక ఐఫోన్, ఐపాడ్ లో ఎలా చేయాలంటే.గూగుల్ మ్యాప్స్ లో ట్రాక్ చేయాలనుకునే ఎదుటి వ్యక్తి జీమెయిల్ ఐడీని యాడ్ చేయాలి.గూగుల్ మ్యాప్స్ లో మీ ప్రొపైల్ ను క్లిక్ చేసి ట్రాక్ చేయాలనుకునే వ్యక్తిని యాడ్ చేయాలి.
తర్వాత షేర్ లోకేషన్ బటన్ ను క్లిక్ చేసి ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారు, ఎంతసేపు అనే వివరాలను ఇవ్వాలి.
కాంటాక్ట్ నెంబర్లను యాడ్ చేయాలి.
ట్రాకింగ్ కు రెడీగా ఉన్నప్పుడు షేరింగ్ బటన్ ను క్లిక్ చేస్తే మీరు సెలక్ట్ చేసుకున్న వ్యక్తులు మిమ్మల్ని ట్రాక్ చేయడానికి వీలు కుదురుతుంది.ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా ఇలాగే చేయవచ్చు.







