సాధారణంగా సినిమా పరిశ్రమలో కథల కొరత ఎప్పుడు ఉంటూనే ఉంటుంది.ఉన్న కథను కాస్త అటు తిప్పి ఇటు తిప్పి, కాసింత మసాలా యాడ్ చేసి విడుదల చేయడం దర్శకులకు బాగా అలవాటైన పని.
ఓకే కథను నమ్ముకుని పాత్రలను మార్చుకుంటూ స్క్రీన్ ప్లే వారి సొంతంగా చేసుకుంటూ సినిమాని రక్త కట్టించేలా చేయడమే ఇప్పుడున్న మేకర్స్ యొక్క ప్రాథమిక పని.అలా మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకే పునర్జన్మల కాన్సెప్టుపై అనేక సినిమాలు రాగా అందులో అతి తక్కువ విజయవంతం సాధించాయి.మరి అలా వచ్చిన వాటిల్లో ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయి.? ఎన్ని ఫ్లాప్ అయ్యాయి ? అనేది ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం పదండి.
మగధీర
రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కింది.పునర్జన్మ అనే ఒక ఇతివృత్తాన్ని తీసుకొని సినిమా తీయగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది.
శ్యామ్ సింగ రాయ్

నాని సాయి పల్లవి కృతి శెట్టి హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా సైతం పునర్జన్మల ఆధారంగా తెరకెక్కి అత్యద్భుతంగా ఘనవిజయాన్ని సాధించిన చిత్రంగా చరిత్రలో నిలిచింది.
జానకి రాముడు

విజయశాంతి నాగార్జున హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని పొందలేకపోయినా ఇప్పటికీ టీవీలో వస్తే మాత్రం కచ్చితంగా చూస్తూనే ఉంటారు.
ప్రాణం

అల్లరి నరేష్ సదా నటించిన ఈ సినిమా పునర్జన్మ ఆధారంగానే తెరకెక్కింది కానీ ఈ సినిమా సైతం కమర్షియల్ గా హిట్ కాలేకపోయినా ఎమోషనల్ గా కొంతమేర సినిమా కనెక్ట్ అయింది.
మూగ మనసులు

కమర్షియల్ సినిమాలకి బెస్ట్ ఉదాహరణగా నిలిచింది మూగమనసులు సినిమా.ఈ సినిమాలో ఏఎన్నార్, సావిత్రి నటించగా ఇది ఒక సూపర్ డూపర్ కమర్షియల్ హిట్ సినిమాగా నిలిచింది.పునర్జన్మ ఆధారంగా వచ్చిన తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం.
అంతే కాదు తొలి విజయాన్ని కూడా ఇదే అందించింది.ఈ సినిమాని ఆధారం చేసుకుని ఆ తర్వాత కాలంలో అనేక సినిమాలు పుట్టుకొచ్చాయి.
దాంట్లో సక్సెస్ రేట్ ఒకింత తక్కువే అయినా సినిమాలు మాత్రం జనాలను ఆకట్టుకుంటూనే ఉన్నాయి.







