అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే మీనా నిజానికి మద్రాస్ లో పుట్టి పెరిగింది.తమిళనాట సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి, హీరోయిన్ గా కూడా తొలుత తమిళ పరిశ్రమలోనే అడుగు పెట్టింది.
మీనా తల్లి రాజమల్లిక ఒకప్పుడు నటిగా నటించడంతో తల్లి వారసత్వాన్ని కొనసాగించింది మీనా.బాలనటిగా కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోస్ తో నటించింది.
అనతి కాలంలోనే హీరోయిన్ గా ఎదిగి అందరు స్టార్ హీరోలతో కూడా రొమాన్స్ చేసింది.చారడేసి కళ్ళతో చూడటానికి బుట్ట బొమ్మలా ఉండే మీనా హీరోయిన్ కావడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు.
తెలుగులో వెంకటేష్ కి పర్ఫెక్ట్ జోడి అనిపించుకున్న మీనా తమిళంలో రజనీకాంత్ కి హీరోయిన్ గా చక్కగా సరిపోయేది.రజనీకాతతో ముత్తు వీరా, యజమాన్, అవ్వై షన్ము వంటి సినిమాల్లో ఆమెకు విజయాన్ని అందించాయి.
వెంకటేష్ తో సూర్యవంశం, చంటి, అబ్బాయిగారు, సుందరకాండ వంటి సినిమాలు హిట్ చిత్రాలుగా నిలిచాయి.ఇక సినిమాలు చాలు అనుకున్న సమయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్ ని పెద్దలు చూడగా వివాహం చేసుకుంది.
ఈ జంటకు నైనిక అనే కుమార్తె కూడా ఉంది.ఇక వీరి పెళ్లిచూపుల సమయంలో ఒక వింత సంఘటన జరిగిందట.

విద్యాసాగర్ పెళ్లి చూపులకు వచ్చిన సమయంలో మీనాతో ప్రైవేట్ గా మాట్లాడారట.కాని వారి అభిప్రాయాలు అలాగే వృత్తులు, భవిష్యత్తుపై ఆలోచనలు ఒక్కటి కూడా కలవకపోవడంతో పెళ్లి చేసుకోనని మీనా మొహం పైనే చెప్పిందట.దాంతో విద్యాసాగర్ ఆల్ ద బెస్ట్ చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడట.కానీ మీనా మేనత్త విద్యాసాగర్ యొక్క గుణగణాలు మంచివని, అతనిని మిస్ చేసుకుంటే లైఫ్ లో బాధపడతావ్ అంటూ బలవంతం చేయడంతో పెళ్లికి ఒప్పుకుందట.
కానీ విద్య సాగర్ నీ పెళ్లి చేసుకోవడం వల్ల తాను జీవితంలో మాత్రం ఎలాంటి బాధపడలేదు అని చెప్పింది మీనా.







