టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ సీక్వెల్స్ అనిపించుకున్న మూడు సినిమాలు ఇవే!

సినిమా ఇండస్ట్రీలో హిట్ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించడం సులువే అయినా సీక్వెల్ తో కూడా సక్సెస్ సాధించడం సులువు కాదు.ఫస్ట్ పార్ట్ తో పోల్చి చూస్తే సెకండ్ పార్ట్ మరింత సక్సెస్ సాధిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవనే సంగతి తెలిసిందే.

 Tollywood Industry Best Sequels Details Here Goes Viral Tollywood, Karthikay2,-TeluguStop.com

అయితే మూడు సినిమాలు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ సీక్వెల్స్ అనిపించుకున్నాయి.అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్య సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఆర్య సినిమాకు సీక్వెల్ గా ఆర్య2 సినిమా తెరకెక్కి 2009 సంవత్సరం నవంవర్ 25వ తేదీన విడుదలైంది.ఆర్యలోని పాత్రలను తీసుకొని సరికొత్త కథతో సుకుమార్ ఆర్య2 సినిమాను తెరకెక్కించగా ఈ సినిమా కమర్షియల్ గా ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా ప్రేక్షకులకు మాత్రం ఎంతగానో నచ్చిందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

టాలీవుడ్ లోని బెస్ట్ సీక్వెల్స్ లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది.

Telugu Allu Arjun, Anupama, Anushka, Arya, Bahubali, Sequels, Kajal, Karthikay,

ఆర్య2 సినిమా ఇప్పుడు టీవీలో ప్రసారమైనా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుండటం గమనార్హం.రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి, బాహుబలి2 సినిమాలు సంచలన విజయాలను సాధించాయి.బాహుబలి1 తో పోల్చి చూస్తే బాహుబలి2 సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి టాలీవుడ్ లోని బెస్ట్ సీక్వెల్స్ లో ఒకటి అనిపించుకుంది.కలెక్షన్ల విషయంలో కూడా బాహుబలి2 సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిందనే సంగతి తెలిసిందే.కార్తికేయ, కార్తికేయ2 సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

కథ విషయంలో కార్తికేయ, కార్తికేయ2 సినిమాలకు పోలిక లేకపోయినా కార్తికేయ2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుండటంతో ఫ్యాన్స్ సైతం ఎంతగానో సంతోషిస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube