వెళ్తున్న విమానంలో నిద్రపోయిన పైలట్లు.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే!

వెళ్తున్న ఏ వాహనంలోనైనా సరే డ్రైవర్ నిద్రపోతే అది ఎంత ప్రమాదకరమో ఊహించడం కూడా కష్టమే.అయితే ఇటీవల ఏకంగా అతిపెద్ద విమానం నడిపే పైలట్లు ఆదమరచి నిద్రపోయారు.

 Ethiopian Pilots Fell Asleep While Flying Details, Flight , Slepping , Poilet,-TeluguStop.com

విమానం ఏకంగా 37 వేల అడుగుల ఎత్తులో ఉండగా వీరు ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా పడుకున్నారు.అయితే అదృష్టం కొద్దీ పడుకునే ముందు వారు విమానాన్ని ఆటో పైలట్ మోడ్‌లో పెట్టారు.

దాంతో విమానం కంట్రోల్ తప్పి కిందపడిపోలేదు.కానీ అది ల్యాండింగ్ మిస్సయింది.

అలా 25 నిమిషాల పాటు దానంతట అదే గాల్లో చక్కర్లు కొడుతూ ప్రయాణికులకు హడల్ పుట్టించింది.ఇదంతా జరుగుతున్నా, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ అలర్ట్‌ చేసినా గుర్తించలేనంత గాఢనిద్రలో మునిగిపోయారు కాక్‌పిట్‌లోని పైలట్లు.

ఈ షాకింగ్ ఘటన ఆగస్టు 15న ఇథియోపియాలో వెలుగు చూసింది.

వివరాలు తెలుసుకుంటే.

ఈనెల 15న ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక బోయింగ్ విమానం సూడాన్‌లోని ఖార్టూమ్‌ నుంచి బయల్దేరి ఇథియోపియా రాజధాని అడ్డిస్‌ అబాబా వైపు ప్రయాణించడం స్టార్ట్ చేసింది.అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత పైలట్లకు నిద్ర వచ్చింది.

వారు నిద్రపోయేముందు ఆటోపైలట్‌ మోడ్‌లో పెట్టారు.ఆ తర్వాత విమానాన్ని పట్టించుకోవడమే మానేశారు.

ఇలా దాదాపు 25 నిమిషాల పాటు విమానం రన్‌వేపైనే విహంగ విహారం చేసింది.

Telugu Adis Ababa, Aeroplanepilots, Auto Pilot Mode, Ethiopianpilots, Pilots Sle

ఆటోపైలట్‌ మోడ్ టైమ్ కూడా అయిపోవడంతో అది డిస్‌కనెక్ట్‌ అయ్యింది.అనంతరం చాలా పెద్దగా అలారమ్‌ మోగడంతో పైలట్లు ఉలిక్కిపడి లేచారు.ఆ తర్వాత తాము ఎంత పెద్ద తప్పు చేసామో తెలుసుకున్నారు.

అనంతరం వెంటనే విమానాన్ని ల్యాండ్ చేశారు.దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

అయితే పైలట్లు ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం విమానయాన సంస్థకి ఆగ్రహం తెప్పించింది.ఇప్పుడు వారిపై చర్యలు తీసుకునే పనిలో పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube