అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ తమ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని చాలా అలెర్ట్ గా ఉంటుంది.తమ ఉత్పత్తుల్లోని సాఫ్ట్‌వేర్‌లో ఏదైనా భద్రతా లోపంగాని వచ్చినట్లైతే దాన్ని గుర్తించి, వెంటనే యూజర్లకు అలర్ట్స్ పంపిస్తుంది.
ఈ క్రమంలోనే ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ కంప్యూటర్లు వినియోగిస్తున్న వారంతా తమ సాఫ్ట్‌వేర్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని తాజాగా సూచించింది.లేదంటే హ్యాకర్ల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఈ భద్రతా లోపం వల్ల హ్యాకర్లు పూర్తిగా డివైజ్‌ను తమ నియంత్రణలోకి తీసుకునే అవకాశం ఉందని యాపిల్ తెలిపింది.
ఈ మేరకు యూజర్లను హెచ్చరిస్తూ ఈ బుధవారం, గురువారం రెండు విడతల్లో భద్రతా లోపాలపై ప్రకటనలు చేసింది.
ఈ విషయం తెలియనివారు వెంటనే అప్రమత్తం కండి.ఐఫోన్ 6ఎస్‌తో పాటు దాని తర్వాతి మోడళ్లు, ఐప్యాడ్ 5వ జనరేషన్ సహా దాని తర్వాత వచ్చిన మోడళ్లు, ఐప్యాడ్ ఎయిర్2.
దాని తర్వాతి మోడళ్లు, ఐప్యాడ్ మినీ 4 దాని తర్వాత వచ్చినవి, ఐప్యాడ్ ప్రో అన్ని మోడళ్లు, 7వ జనరేషన్ ఐపాడ్ టచ్.పరికరాలన్నింటినీ ఖచ్చితంగా వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని యాపిల్ సూచిస్తోంది.
కొన్ని మ్యాక్ కంప్యూటర్లలో కూడా ఈ లోపం ఉన్నట్లు తెలిపింది.

అందువలన వాటిని కూడా వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని చెబుతోంది.ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా సెక్యూరిటీ అప్‌డేట్‌లను డివైజ్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచిస్తోంది.అయితే, ఈ లోపాన్ని ఎప్పుడు, ఎవరు గుర్తించారన్నది మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
ఈ మేరకు IOS 15 యూజర్ల కోసం యాపిల్ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది.ఐఫోన్ యూజర్ల కోసం ఐఓఎస్ 15.6.1, ఐపాడ్ యూజర్ల కోసం ఐపాడ్ ఓఎస్ 15.6.1 వెర్షన్‌లను తీసుకొచ్చింది.ఈ అప్‌డేట్‌లతో రెండు ముఖ్యమైన లోపాలను సరిచేసినట్లు యాపిల్ కంపెనీ తెలిపింది.








