భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరికి వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది.ప్రస్తుతం నీటిమట్టం 47.90 అడుగులుగా ఉండగా.ఎగువ నుండి గోదావరికి 11,39,230 క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.మరోవైపు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది.ప్రస్తుతం నీటిమట్టం 15.10 అడుగులకు చేరుకోగా.బ్యారేజీ నుంచి 14,94,850 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి ప్రవహిస్తోంది.