ఏపీలో అసమర్థ ప్రభుత్వం పాలన చేస్తుందని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు.ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు.
హామీలు నెరవేర్చకుంటే రాజీనామా చేయాలని గతంలో జగనే అన్నారని విమర్శించారు.టీడీపీ హయాంలో పోలవం పనులు 72 శాతం పూర్తి కాగా, వైసీపీ పాలనలో మాత్రం కేవలం 3 శాతం పనులు కూడా పూర్తి కాలేదని ఎద్దేవా చేశారు.
ఈ నేపథ్యంలో సీఎంగా జగన్ రాజీనామా చేస్తారా లేక ఢిల్లీకి వచ్చి పోరాడతారా ? అని ప్రశ్నించారు.జగన్ ఇప్పటికైనా ప్రధానిని కలిసి పోలవరాన్ని పూర్తి చేయాలని అడగాలని డిమాండ్ చేశారు.







