విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా లైగర్.ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.
బాలీవుడ్ డైరక్టర్ కం ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ సినిమాని హిందీలో భారీగా రిలీజ్ చేస్తున్నారు.ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా హిందీ వర్షన్ మాత్రం ఒకరోజు ఆలస్యంగా వస్తుందని అంటున్నారు.
ఆగష్టు 25న లైగర్ సినిమా రిలీజ్ ప్రకటించారు.కానీ హిందీలో ఈ సినిమాని ఒకరోజు లేట్ గా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.మరి హిందీలో ఈ లేట్ కి కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది.ఇక కొన్నాళ్లుగా తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో ముందురోజు ప్రీమియర్స్ వేయట్లేదు.
కానీ లైగర్ తో అది మళ్లీ మొదలవుతుంది.లైగర్ సినిమా యూఎస్ లో ఆగష్టు 24 రాత్రి వేయనున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లైగర్ సినిమాని గురువారం ఉదయం ఆటతో రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా మీద రౌడీ బోయ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు.
ఈ సినిమాతో నేషనల్ లెవల్ లో సత్తా చాటనున్నాడు విజయ్.