స్ట్రెచ్ మార్క్స్ తో టెన్ష‌న్ వ‌ద్దు.. ఈ సింపుల్ టిప్స్‌తో వాటిని వ‌దిలించుకోండి!

ప్ర‌స‌వం అనంత‌రం దాదాపు మ‌హిళ‌లంద‌రూ ప్ర‌ధానంగా ఎదుర్కొనే స‌మ‌స్య స్ట్రెచ్ మార్క్స్.చ‌ర్మం సాగ‌డం వ‌ల్ల స్ట్రెచ్ మార్క్స్ ఏర్ప‌డుతుంటాయి.

 How To Get Rid Of Stretch Marks At Home, Stretch Marks, Stretch Marks Removal Ti-TeluguStop.com

ఇవి చూసేందుకు అస‌హ్యంగా క‌నిపించమే కాదు.చ‌ర్మ సౌంద‌ర్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బ తీస్తాయి.

అందుకే స్ట్రెచ్ మార్క్స్ ను నివారించుకోవ‌డం కోసం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.కొంద‌రైతే ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.

కానీ, ఇంట్లోనే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ టిప్స్ ను పాటిస్తే చాలా అంటే చాలా సుల‌భంగా స్ట్రెచ్ మార్క్స్‌ను వ‌దిలించుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల కాఫీ బీన్స్‌, వ‌న్ టేబుల్ స్పూన్ షుగ‌ర్ వేసుకుని మెత్త‌గా పొడి చేసుకోవాలి.ఈ పొడిలో వ‌న్ టేబుల్ స్పూన్ కోకో పౌడ‌ర్‌, రెండు టేబుల్ స్పూన్ల ఆల్మండ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసేంత వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ప్ర‌భావిత ప్రాంతంలో అప్లై చేసుకుని.సున్నితంగా నాలుగు నిమిషాల పాటు స్క్ర‌బ్ చేసుకోవాలి.ఆపై గోరు వెచ్చ‌ని నీటితో చ‌ర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.ఉద‌యం స్నానం చేయ‌డానికి గంట ముందు ఇలా చేయాలి.

Telugu Tips, Latest, Skin Care, Skin Care Tips, Stretch, Stretchremoval-Telugu H

అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ కొబ్బ‌రి నూనె, వ‌న్ టేబుల్ స్పూన్ బాదం, వ‌న్ టేబుల్ స్పూన్ జోజోబా నూనె, వ‌న్ టేబుల్ స్పూన్ ఆముదం, మూడు చుక్క‌లు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.రాత్రి నిద్రించే ముందు ఈ ఆయిల్‌ను ప్ర‌భావిత ప్రాంతంలో అప్లై చేసుకుని మ‌సాజ్ చేసుకోవాలి.ఈ రెండు సింపుల్ చిట్కాల‌ను ప్ర‌తి రోజు పాటిస్తే స్ట్రెచ్ మార్క్స్ క్ర‌మంగా మాయం అవుతాయి.మ‌రియు చ‌ర్మం నిగారింపుగా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube