ఇవి చూసేందుకు అసహ్యంగా కనిపించమే కాదు.చర్మ సౌందర్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బ తీస్తాయి.
అందుకే స్ట్రెచ్ మార్క్స్ ను నివారించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.కొందరైతే ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.
కానీ, ఇంట్లోనే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ ను పాటిస్తే చాలా అంటే చాలా సులభంగా స్ట్రెచ్ మార్క్స్‌ను వదిలించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండీ.ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల కాఫీ బీన్స్, వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.
ఈ పొడిలో వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల ఆల్మండ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసుకుని.సున్నితంగా నాలుగు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి.
ఆపై గోరు వెచ్చని నీటితో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.ఉదయం స్నానం చేయడానికి గంట ముందు ఇలా చేయాలి.
"""/" /
అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, వన్ టేబుల్ స్పూన్ బాదం, వన్ టేబుల్ స్పూన్ జోజోబా నూనె, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, మూడు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
రాత్రి నిద్రించే ముందు ఈ ఆయిల్‌ను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.
ఈ రెండు సింపుల్ చిట్కాలను ప్రతి రోజు పాటిస్తే స్ట్రెచ్ మార్క్స్ క్రమంగా మాయం అవుతాయి.
మరియు చర్మం నిగారింపుగా మారుతుంది.
ఈ ఎఫెక్టివ్ ప్యాక్ తో మీ జుట్టు రెండింతలు అవుతుంది!