నందమూరి బాలకృష్ణ చూడ్డానికి ఎంతో గాంభిర్యంగా కోపంగా కనిపించినప్పటికీ ఆయన మనసు మాత్రం ఎంతో మంచిదనే విషయం ఇప్పటికే ఎంతోమంది ఎన్నోసార్లు వెల్లడించారు.ఇలా బాలకృష్ణ తన మంచి మనసును కూడా వివిధ రూపాలలో చాటుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇకపోతే తనని అభిమానించే అభిమానుల కోసం బాలకృష్ణ ఎలాంటి సాహసానికైనా వెనకాడరు.అలాగని తన ముందు పిచ్చి చేష్టలు చేస్తే మాత్రం వారి చెంప చెల్లుమనిపించడానికి కూడా బాలయ్య ముందు వరుసలో ఉంటారు.
ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలోని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయన ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం అంబులెన్స్ ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే.ఈ ఆరోగ్య రథం ద్వారా ఏకంగా 200 రకాల వైద్య పరీక్షలను నిర్వహించడమే కాకుండా పలు చికిత్సలు చేస్తూ ఉచితంగా మందులను కూడా సరఫరా చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి తన భార్య వసుంధర తో కలిసి ఈ వాహనాన్ని ప్రారంభించిన బాలకృష్ణ అనంతరం తన అభిమాని ఇంటికి చేరుకొని పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు.
ఈ విధంగా బాలకృష్ణ అభిమాని ఇంటికి వెళ్లారంటే ఆయన బాలకృష్ణ అభిమాన సంఘానికి నేత కాదు, అలాగని టిడిపి ప్రచార కార్యకర్త కూడా కాదు.

ఒక సాధారణ అభిమాని మాత్రమే.ఇలా బాలకృష్ణ ఊహించని విధంగా తన అభిమాని ఇంటికి వెళ్లి తనకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు.అయితే బాలకృష్ణ ఆ అభిమాని ఇంటికి వెళ్లడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…ఆరోజు తన అభిమాని పుట్టినరోజు అని తెలుసుకున్న బాలకృష్ణ సరాసరి ఆయన ఇంటికి వెళ్లి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇలా ఊహించని విధంగా బాలకృష్ణ తన ఇంటికి రావడం చూసి ఒక్కసారిగా ఆ అభిమాని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ క్రమంలోనే బాలయ్య ఆ అభిమానిని ఆశీర్వదించి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో ఒక్కసారిగా ఆయన తనకు అసలు సిసలైన పుట్టినరోజు ఈరోజు అంటూ ఎమోషనల్ అయ్యారు.ఈ విధంగా తన అభిమాన హీరో తన ఇంటికి రావడంతో అభిమాని బాలయ్యకు శాలువా కప్పి సన్మానం చేశారు.ఇక ఈ విషయం తెలిసిన బాలయ్య అభిమానులు ఇది కదా బాలయ్య మంచితనం అంటే అంటూ పెద్ద ఎత్తున తమ హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.







