కోతి తుంటరి పని.. మహిళ నుంచి కళ్లద్దాలు లాగేసుకుంది

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ గా మారుతూ ఉంటాయి.కొన్ని ఫన్నీ వీడియోలు నవ్వు తెప్పిస్తాయి.

 Woman Fight With Monkey For Sun Glasses Funny Video Viral Details, Monkey, Vira-TeluguStop.com

జంతువులకు సంబంధించిన వీడియోలను చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు.తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

కోతి, మనిషికి మధ్య జరిగిన ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది.కోతులు చాలా తుంటరి.

చిలిపి పనులన్నీ చేస్తూ ఉంటాయి.కోతులు మందు బాటిల్స్ పట్టుకుని వాటిని తాగుతున్నట్లు చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

ఇక మనుషుల చేతుల్లోని స్మార్ట్ ఫోన్లు, తిండి పదార్థాలు.ఇలా మనుషుల చేతుల్లోను వస్తువులను తీసుకుకని వెళ్లడం లాంటి వీడియోను సోషల్ మీడియాలో చాలా కనిపిస్తూ ఉంటాయి.

ఎదురుతిరిగితే మనుషులపై దాడికి కూడా పాల్పడుతూ ఉంటాయి కోతులు.తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఓ మహిళ ఆంజనేయ స్వామి గుడికి వెళ్లింది.అక్కడ ఆంజనేయుడికి పూజలు చేయడం ప్రారంభించింది.

స్వామికి పూజలు చేస్తూ తన కళ్లకు పెట్టుకున్న సన్ గ్లాసెస్ ను తీసి పక్కన పెట్టింది.అయితే ఓ కోతి సడెన్ గా అక్కడకి వచ్చి సన్ గ్లాసెస్ ను తీసుకుంది.

అక్కడ నుంచి సన్ గ్లాసెస్ ను తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేసింది.అయితే సదరు మహిళతో కోతి నుంచి సన్ గ్లాసెస్ ను లాక్కుంది.

కోతితో కుస్తీలు పడి ఎట్టకేలకు తన సన్ గ్లాసెస్ ను దక్కించుకుంది.

కోతితో ఎందుకు.పోనీవ్వులే అని పక్కనవారు చెప్పినా ఆ మహిళ వినలేదు.కోతితో కోట్లాడి తన సన్ గ్లాసెస్ ను లాక్కుంది.

అక్కడి భక్తులు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసినవారు తెగ నవ్వుకుంటున్నారు.

సంజు 1290 అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను తన అకౌంట్ లో పోస్ట్ చేశాడు.దీంతో ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించారు.

అలాగే లక్షల మంది లైక్ లు కొట్టి కామెంట్స్ పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube