మునుగోడులో ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు

నల్లగొండ జిల్లా:టిఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం అమలు చేయాలని,ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపలనే నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి ఎస్సీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు దళిత బంధు పథకం అందించాలని బిజెపి ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్, బీజేపీ జిల్లా ప్రచార కార్యదర్శి బిపంగి జగ్జీవన్ రామ్ లు డిమాండ్ చేశారు.బుధవారం మధ్యాహ్నం బిజెపి జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ హుజురాబాద్ ఎన్నికల సమయంలో ఆ నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా అయితే దళిత బంధు పథకాన్ని అమలు చేశారో అదే విధంగా మునుగోడులో కూడా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రతి దళిత కుటుంబాలకు దళిత బంధు అమలు చేయాలన్నారు.

 Earlier Every Dalit Family Had A Dalit Bandhu-TeluguStop.com

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులకు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని,దళిత ముఖ్యమంత్రి ఇంకా ఇవ్వలేదు, మూడు ఎకరాల వ్యవసాయ భూమి లేదు, ఉద్యోగాలు లేవు,సబ్సిడీలు లేవని గుర్తు చేశారు.టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అందరికన్నా నష్టపోయినది దళిత వర్గాలేనని,దానికి కారణం దళిత వ్యతిరేక ముఖ్యమంత్రి పాలనే కారణమన్నారు.

ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై దాడికి పాల్పడడం సిగ్గుచేటని అన్నారు.రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు దిగుతున్నారని విమర్శించారు.

ఈ దాడిని ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నామని, మునుగోడులో ప్రతి ఎస్సీ కుటుంబాలకు చైతన్యవంతం చేసి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బిజెపికి అనుకూలంగా మలిచి మునుగోడు బిజెపి వశం చేసుకోవడానికి ఎస్సీలు కారణం కాబోతున్నారని వారు వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి పోతేపాక ధర్మయ్య, జిల్లా కార్యక్రమాల సెల్ కన్వీనర్ చింతపల్లి వెంకన్న, మామిళ్ళ శ్రీనివాస్,కనగల్లు మండల ఉపాధ్యక్షులు అదిమల్ల దేవేందర్,జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల దశరథ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube