'సీతారామం' దూకుడు అస్సలు తగ్గడం లేదుగా.. యూఎస్ లో నాన్ స్టాప్ వసూళ్లు!

చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్స్ పడే సరికి టాలీవుడ్ కి కొత్త కళ వచ్చింది.గత జులై నెలలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అనేవే పడలేదు.

 Dulquer Salmaan's Sita Ramam Sets Us Box Office On Fire, Us Box Office, Dulquer-TeluguStop.com

వచ్చిన సినిమా వచ్చినట్టు ప్లాప్ అవుతూ వచ్చాయి.దీంతో ఆగష్టు నెలలో రిలీజ్ అయ్యే సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూసారు.

మరి ఆ ఎదురు చూపులు ఫలించి మంచి సినిమాలు వచ్చాయి.ఈ నెలలో రిలీజ్ అయినా సినిమాల్లో సీతా రామం ఒకటి.

ఆగష్టు ఫస్ట్ వారంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.హ్యాండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ హీరోగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన సినిమా సీతా రామం.

యుద్ధం నేపథ్యంలో అందమైన ప్రేమ కథను మరింత ఎమోషనల్ గా తెరకెక్కించాడు డైరెక్టర్.

ఈ సినిమా రిలీజ్ ముందు అంత అంచనాలు లేకపోయినా రిలీజ్ తర్వాత మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

దీంతో ఈ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.ఆగష్టు 5న రిలీజ్ అయినా ఈ సినిమా ఇండియా లోనే కాదు ఓవర్సీస్ లో కూడా వసూళ్ల సునామీ సృష్టిస్తుంది.

యూఎస్ మార్కెట్ లో ఏకంగా 1 మిలియన్ మార్క్ టచ్ చేసింది.

Telugu Ashwini Dutt, Dulquer Salmaan, Dulquersalmaans, Mrunal Thakur, Sita Ramam

అక్కడి వాళ్లకు కూడా బాగా నచ్చడంతో వసూళ్ల పరంపర కొనసాగుతూనే ఉంది.ఈ సినిమా తాజాగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1.1 మిలియన్ డాలర్స్ వసూళ్లు చేసి ఇంకా స్ట్రాంగ్ గా నిలబడింది.మరి ఈ వసూళ్లను చూస్తుంటే ఇప్పట్లో ఈ దూకుడు అస్సలు తగ్గేలా కనిపించడం లేదు.కాగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మించారు.

రష్మిక మందన్న కూడా కీలక పాత్రలో నటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube