మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ భర్త హీరో కళ్యాణ్ దేవ్ గురించి మనందరికీ తెలిసిందే.కళ్యాణ్ దేవ్ హీరోగా పలు సినిమాల్లో నటించినప్పటికీ అవి పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.
కాగా మొన్నటి వరకు సోషల్ మీడియాలో కళ్యాణ్ దేవ్ పేరు మారుమోగిపోయింది.కళ్యాణ్ దేవ్, శ్రీజ విడిపోయారని అందుకే దూరం దూరంగా ఉంటున్నారు అంటూ పర్సనల్ విషయం గురించి విడాకుల వ్యవహారం గురించి లెక్కలేనన్ని కథనాలు వినిపించాయి.
అయితే ఇప్పటివరకు వాటి మీద ఇటు కళ్యాణ్ దేవ్ కానీ అటు శ్రీజ కానీ స్పందించలేదు.ఈ వార్తలపై మెగా అభిమానులు కూడా తీవ్ర ఆందోళన చెందినప్పటికీ ఆ వార్తలపై వాళ్లు స్పందించకపోవడంతో అభిమానులు ఆ విషయం గురించి పట్టించుకోవడమే మానేశారు.
ఇకపోతే కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటాడు అన్న సంగతి తెలిసిందే.ఏదైనా ఒక సందర్భం ఉంటే తప్ప కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో కనిపించడు.
అంతేకాకుండా తనకు సంబంధించిన ఫోటోలను కూడా చాలా తక్కువగా షేర్ చేస్తూ ఉంటాడు.కాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్న కళ్యాణ్ దేవ్ తెలుగు సంబంధించిన ఫోటోలు వీడియోలు వర్కౌట్ కి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూన్నాడు.
ఇది ఇలా ఉండే తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చారు కళ్యాణ్.

మీరు ఒకరితో మాట్లాడాలని అనుకుంటారు.కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియదు.చాలా కష్టంగా నవ్వుతూ ఉంటారు.
మధ్యలోనే ఆపేయాలని అనుకుంటారు.కానీ మీ పక్కన ఉన్న ఫ్రెండ్ మాత్రం ఇంకా నవ్వుతూనే ఉంటాడు.
క్లాసుకు లేట్‌గా వెళ్తే.మనం నడుచుకుంటూ వెళ్తుంటే.
అందరూ మనల్ని చూస్తుంటారు.మనమేదో హత్య చేసినట్టు.
మన ఏజ్ గురించి అడుగుతుంటారు.మనం ఆలోచించి సమాధానం చెబుతాం.
మనకు ఒకరితో ఇంకా మాట్లాడాలని ఉంటుంది.కానీ ఎలా కంటిన్యూ చేయాలో తెలియనప్పుడు.
మనం ఓ కథ చెబుతున్నప్పుడు.ఎవ్వరూ వినడం లేదని తెలిసినప్పుడు.
ఇక మెల్లిగా అక్కడి నుంచి వెళ్లిపోయి అటువంటి వారికీ ఇంకెప్పుడూ చెప్పకుండా ఉంటాము.మనం లెక్కను ఎంతో కష్ఠపడి చేస్తాం.
కానీ ఇచ్చిన ఆప్షన్స్‌లో అది ఉండదు ఇలాంటి కొన్ని పరిస్థితుల్లో మనకు ఏదోలా అనిపిస్తుంటుంది.మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయా? అంటూ కళ్యాణ్ దేవ్ ఫన్నీగా ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ రాసుకొచ్చాడు.








