ప్రజలకు మరింత చేరువుగా సేవలు అందించాలనే ఉద్దేశ్యంతోనే గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారున.విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కరకం గ్రామంలో సుమారు రూ.40 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఆయన ప్రారంభించారు.ప్రతి ఒక్కరు గ్రామ సచివాలయాన్ని సద్వినియోగపరుచుకోవాలని అన్నారు.
ఆ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.