ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరుకు విశేష కృషి చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ సూపరిండెంట్ బి వెంకటేశ్వరరావు, టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు షేక్ అప్జల్ హాసన్ కార్యవర్గం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.మెడికల్ కళాశాల మంజుతుతో ఖమ్మం జిల్లా కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరిగాయని, వైద్య రంగం మరింత బలోపేతం అయ్యేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని వివరించారు.
సామాన్యులకు ప్రభుత్వ వైద్యం విరివిగా అందించేందుకు సకల సౌకర్యాలు కల్పించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.ప్రభుత్వం సమకూర్చిన రోగ నిర్ధారణ పరికరాలతో సామాన్యులకు మెరుగైన, నాణ్యమైన విద్య సేవలు అందిస్తూ, అన్ని చికిత్సలు చేసి ప్రభుత్వ లక్ష్యంను కాపాడాలని మంత్రి పువ్వాడ వారికి సూచించారు.
మంత్రిని కలిసిన వారిలో హాస్పిటల్ డాక్టర్ కృప ఉషశ్రీ, డాక్టర్ సీతారాం నాయక్ (కార్డియాలజిస్ట్), డాక్టర్ సురేష్, నర్సింగ్ సూపరిండెంట్ డి.సుగుణ, టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఆర్.వి.ఎస్.సాగర్, ఉపాధ్యక్షులు నందగిరి శ్రీనివాస్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శాబాస్ జ్యోతి, ఎస్.మేరీ, స్వప్న, అశ్విని రెడ్డి, సబియా బేగం,ఝాన్సీ, బేబీ లావణ్య, రామారావు, రహీం, అబీబ్, సత్యనారాయణ, రాకేష్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.







