టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే.బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ప్రభాస్.
కాగా ప్రస్తుతం ప్రభాస్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే.ప్రభాస్ కి ఉన్న క్రేజ్ నీ దృష్టిలో పెట్టుకున్న దర్శక నిర్మాతలు ప్రభాస్ అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చి తనతో సినిమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.
అటువంటిది ఏకంగా హీరో ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వస్తే అయినా వదులుకుంటారా? కానీ ఒక నిర్మాత అటువంటి అవకాశాన్ని వదులుకున్నాడట.
ఆ నిర్మాత మరెవరో కాదు దానయ్య.
ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో సినిమా ప్లానింగ్ లో ఉంది .అయితే ఈ సినిమా కోసం నిర్మాత దానయ్య 50 కోట్లు అడ్వాన్స్ సింగిల్ పేమెంట్ ఇచ్చారని వార్తలు వినిపించాయి.అంతేకాకుండా ఈ సినిమా కోసం నెలకు ఒక వారం రోజులు ఇవ్వాలని ప్రభాస్ అనుకున్నారట.కానీ ప్రభాస్ ప్రాజెక్టు కే షూటింగ్,ఆదిపురుష్ డబ్బింగ్ వ్యవహారాలు, సలార్ సినిమా వ్యవహారాలతో బిజీగా ఉండటం వల్ల మారుతి సినిమా కాస్త హోల్డ్ లో పడింది.
మరి దానయ్య ఈ విషయంలో వెనుకంజ వేశారో? మరే ఇతర కారణమో తెలియదు కానీ ఈ ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయ్యారట.

దీనితో మరొక నిర్మాత కోసం వెతుకులాట మొదలుపెట్టారట.50 కోట్లు సింగిల్ పేమెంట్ ఇచ్చి, ప్రభాస్ టైమ్ కోసం ఎదురు చూసే నిర్మాత కావాలి.కాగా యువి సంస్థ మరో ఓటిటి సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
కానీ అది సక్సెస్ కాలేదో ఏమిటో తెలియదు కానీ ఇది ఒక పెద్ద నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లిందట.అయితే సదరు డిస్ట్రిబ్యూటర్ కం నిర్మాత ఈ విషయంపై స్పందిస్తూ ప్రభాస్ అన్న సమయంలో సినిమా చేస్తే అంటే తాను రెడీ అని అలా కాకుండా ఎప్పుడు చేస్తారో తెలియకుండా ముందే రంగంలోకి దిగలేమని ఆ నిర్మాత చెప్పడంతో కథ మళ్లీ మొదటికి వచ్చిందట.
కాగా ఈ సినిమాకూడా నిర్మాత మాత్రమే మారుతున్నారు తప్ప దర్శకుడు మాత్రం కాదు.మారుతినే దర్శకుడిగా వుంటారు.







