నాగచైతన్య స్టార్ హీరో కావడానికి మహేష్ బాబు కారణమా.. ఏం జరిగిందంటే?

క్లాస్ సినిమాలతో ప్రేక్షకుల్లో ఊహించని రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో నాగచైతన్య ఒకరు.థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా చైతన్య క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు.

 Mahesh Babu Is The Reason For Nagachaitanya Become Star Hero Details Here Mahesh-TeluguStop.com

చైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఒక సినిమాలో పరశురామ్ డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తున్నారు.అయితే చైతన్య స్టార్ హీరో కావడానికి పరోక్షంగా మహేష్ బాబు కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

జోష్ సినిమాతో నాగచైతన్య టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైనా ఈ సినిమా నాగచైతన్య కెరీర్ కు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏ మాత్రం ప్లస్ కాలేదనే సంగతి తెలిసిందే.ఏ మాయ చేశావె సినిమాతోనే నాగచైతన్య కోరుకున్న భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది.

అయితే ఏ మాయ చేశావె సినిమా మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమా కావడం గమనార్హం.ఏ మాయ చేశావె కథ నచ్చినా మహేష్ బాబు కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించలేదు.

గౌతమ్ వాసుదేవ మీనన్ మహేష్ కోసం తయారు చేసిన ఏ మాయ చేశావె కథలో నాగచైతన్య వచ్చి చేరారు.మహేష్ బాబు ఈ సినిమాలో నటించకపోయినా కథ నచ్చడంతో మహేష్ సోదరి మంజుల ఈ సినిమకు నిర్మాతగా వ్యవహరించారు.

ఈ సినిమాతో సమంత టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కావడంతో పాటు చైతన్య, సమంతల పాత్రలకు మంచిపేరు వచ్చింది.జెస్సీ పాత్రతో సమంత ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

Telugu Josh, Mahesh Babu, Nagachaitanya, Samantha, Tollywood, Ye Maya Chesava-Mo

ఏ మాయ చేశావె బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో చైతన్యకు స్టార్ స్టేటస్ దక్కడంతో పాటు సినిమా ఆఫర్లు ఊహించని స్థాయిలో పెరిగాయి.ఒక విధంగా చైతన్య స్టార్ హీరో కావడానికి మహేష్ బాబు కారణమయ్యారు.చైతన్య తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube