భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.భారతీయులు స్థిరపడిన అనేక దేశాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురువేసి, మిఠాయిలు పంచుకుంటున్నారు.
అనేక మంది దేశాధినేతలు, పలువురు అంతర్జాతీయ ప్రముఖులు భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సహా ఆ దేశ నాయకులు ప్రపంచవ్యాప్తంగా వున్న భారతీయులకు ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పారు.‘‘ ప్రధాన మంత్రిగా తన మొదటి అధికారిక కార్యక్రమం టోక్యోలో జరిగిన క్వాడ్ సమ్మిట్ పాల్గొనడం.అక్కడ తాను భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిశాను.జపాన్ ప్రధాని కిషిదా , అమెరికా అధ్యక్షుడు బైడెన్‌లతో కలిసి మా నిబద్ధతను బలపరిచాము’’ అని ఆంథోనీ అల్బనీస్ ఓ సందేశంలో పేర్కొన్నారు.

సమగ్ర వ్యూహాత్మక భాగస్వాములుగా, భారత్ – ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి కట్టుబడి వున్నాయని ఆంథోనీ అన్నారు.ఈ ఏడాది Australia-India Economic Cooperation and Trade Agreement ఇరుదేశాల పరస్పర వృద్ధి, శ్రేయస్సు వంటి అవకాశాలకు మరింత మద్ధతుగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.నేడు ఆస్ట్రేలియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న కమ్యూనిటీల్లో భారత సంతతి ఒకటని ప్రధాని అన్నారు.
వారు మన సమాజానికి, మన సంస్కృతికి, మనదేశానికి గొప్ప సహకారాన్ని అందిస్తున్నారని ఆంథోనీ పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ కూడా భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పెర్త్‌లోని ఫ్రీమాంటిల్ పోర్ట్‌లో డాక్ చేయబడిన భారతీయ నౌకాదళ నౌక ఐఎన్ఎస్ సుమేధ చిత్రాలను రిచర్డ్ పంచుకున్నారు.ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి ఆండ్రూ గైల్స్ కూడా భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.2021 జనాభా లెక్కల ప్రకారం.మన స్నేహాలు, సంబంధాలు పెరుగుతున్నాయని గైల్స్ అన్నారు.
ఆస్ట్రేలియన్ నివాసితుల కోసం భారత్ ఇప్పుడు మూడో పెద్దదేశమని.అధ్యయనాలు, ఉద్యోగం, వారి భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఆస్ట్రేలియాను తమ నివాసంగా ఎంచుకున్న 9,75,000 మందికి పైగా భారతీయ సంతతికి చెందిన వ్యక్తులను కలిగి వున్నందుకు గర్వంగా వుందని గైల్స్ పేర్కొన్నారు.
కాగా… మెల్బోర్న్, పెర్త్, డార్విన్, సిడ్నీ సహా పలు నగరాల్లో భారత జాతీయ పతాకాలను ఎగురవేశారు.ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ సహా భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఆస్ట్రేలియా వ్యాప్తంగా దాదాపు 40 ఐకానిక్ భవనాలు భారత త్రివర్ణ పతాకం రంగుల్లో వెలిగిపోయాయి.







