ఎలాంటి నీర‌సాన్ని అయినా త‌రిమికొట్టే సూప‌ర్ ప‌వ‌ర్ ఫుల్ డ్రింక్ ఇదే!

అస‌లే ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం కొన‌సాగుతోంది.ఎక్క‌డ చూసినా వైరల్ ఫీవర్స్ వ‌ణికిస్తున్నాయి.

 This Is A Super Powerful Drink To Away Any Fatigue! Fatigue, Powerful Drink, Ban-TeluguStop.com

ఈ వైర‌ల్ ఫీవ‌ర్స్ వ‌ల్ల వ‌చ్చే నీర‌సం అంతా ఇంతా కాదు.ఒక‌వేళ జ్వ‌రం పూర్తిగా త‌గ్గిపోయినా నీర‌సం మాత్రం ప‌ట్టిపీడిస్తూనే ఉంటుంది.

దాంతో ఆ నీర‌సాన్ని ఎలా వ‌దిలించుకోవాలో అర్థంగాక తెగ హైరానా ప‌డిపోతూ ఉంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ ప‌వ‌ర్ ఫుల్ డ్రింక్‌ను తీసుకుంటే ఎలాంటి నీర‌సాన్ని అయినా త‌రిమికొట్ట‌వ‌చ్చు.

మ‌రి ఆల‌స్యం చేయ‌డం ఎంద‌రు ఆ ప‌వ‌ర్ ఫుల్ డ్రింక్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.

తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక చిన్న గిన్నెలో వ‌న్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్‌, వాట‌ర్ వేసుకుని నాన‌బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత బ్లెండ‌ర్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ వేయించిన అవిసె గింజ‌లు, నాన‌బెట్టుకున్న చియా సీడ్స్‌, వ‌న్ టేబుల్ స్పూన్ కోకో పౌడ‌ర్‌, నాలుగు నాన‌బెట్టి పొట్టు తొల‌గించుకున్న బాదం ప‌ప్పులు, నాలుగు పిస్తా ప‌లుకులు, నాలుగు గింజ‌ తొల‌గించిన ఖ‌ర్జూరాలు, పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, అర క‌ప్పు అర‌టి పండు ముక్క‌లు, ఒక అవ‌కాడో ప‌ల్ప్‌, ఒక గ్లాస్ వాట‌ర్ వేసి నాలుగైదు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ బనానా అవ‌కాడో ప్రోటీన్ డ్రింక్ సిద్ధం అవుతుంది.

Telugu Avocado, Banana, Bananaavocado, Fatigue, Tips, Latest, Powerful, Protein,

డ్రింక్‌ను ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ స‌మ‌యంలో ఒక గ్లాస్ చ‌ప్పున వారం రోజుల పాటు తీసుకుంటే నీర‌సం మొత్తం ఎగిరిపోతుంది.బాడీ యాక్టివ్‌గా, ఎన‌ర్జిటిక్‌గా మారుతుంది.అంతేకాదండోయ్‌.

బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న వారు కూడా ఈ డ్రింక్‌ను డైట్‌లో చేర్చుకోవ‌చ్చు.దీన్ని తీసుకోవ‌డం వ‌ల్ల అతి ఆక‌లి దూరం అవుతుంది.

మెట‌బాలిజం రేటు పెరుగుతుంది.దాంతో క్యాల‌రీలు త్వ‌ర‌గా క‌రిగి వేగంగా బ‌రువు త‌గ్గుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube