టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.నందమూరి హీరోలైన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు దేశవిదేశాల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు.
నందమూరి హీరోలు ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్న చాలా సందర్భాల్లో వాళ్లకు విజయాలు దక్కడం గమనార్హం.బింబిసార సినిమా చూసిన తర్వాత బాలయ్య నందమూరి హీరోలు కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం, విభిన్నమైన కథలను ఎంచుకోవడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వశిష్ట్ తో కలిసి త్వరలోనే పని చేస్తానని బాలకృష్ణ అన్నారు.తొలి ప్రయత్నంలోనే వశిష్ట్ బింబిసారలాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించాడని బాలయ్య కామెంట్లు చేశారు.ప్రతిభను నమ్మి కొత్తవారికి సైతం గొప్ప అవకాశాలివ్వడం నందమూరి వంశానికే దక్కుతుందని బాలయ్య చెప్పుకొచ్చారు.సినిమాలలో కొత్త ఒరవడి నాన్నగారితో మొదలైందని బాలయ్య తెలిపారు.
ఏదైనా మాతోనే ప్రారంభం కావాల్సిందే అని బాలయ్య తెలిపారు.
గతంలో నాన్నగారు ఎన్నో ప్రయోగాత్మక సినిమాలలో నటించారని బాలయ్య చెప్పుకొచ్చారు.
ఆ సినిమాలను ప్రేక్షకులు ఆదరించారని ఆయన తెలిపారు.బింబిసార మూవీ ప్రయోగాత్మక మూవీ మాత్రమే కాదని ఈ సినిమా కథలో ఎన్నో నిజాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

బింబిసార మూవీలో భావితరాలకు మంచి సందేశం ఉందని బాలకృష్ణ తెలిపారు.ఈ సినిమాను సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు అని బాలయ్య తెలిపారు.మరోవైపు బింబిసార మూవీ కలెక్షన్లు బాగున్నాయి.కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.బింబిసార1 సినిమాతో కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను అందుకోవడం వల్ల బింబిసార2 సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.బింబిసార ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.ఈ సినిమా కళ్యాణ్ రామ్ కు నటుడిగా కూడా మంచి పేరును తెచ్చిపెట్టింది.







