నందమూరి హీరోలైన బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ లకు ప్రేక్షకులలో ఎంతో క్రేజ్ ఉంది.ఈ ఇద్దరు హీరోలు భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉండటంతో పాటు వరుసగా సక్సెస్ లను అందుకుంటున్నారు.
బాబాయ్ బాలకృష్ణ అబ్బాయి తారక్ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.అయితే ఎవరైనా స్టార్ డైరెక్టర్ ప్రయత్నిస్తే మాత్రమే ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.
అయితే కొంతమంది హీరోయిన్లు అటు బాలయ్యతో ఇటు జూనియర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేశారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో ఆర్తీ అగర్వాల్ ఒకరు.
బి.గోపాల్ డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలో ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు.అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ ఆర్తి అగర్వాల్ కాంబోలో అల్లరి రాముడు సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

మరో హీరోయిన్ సదా బాలయ్యకు జోడీగా వీరభద్ర సినిమాలో నటించగా తారక్ కు జోడీగా నాగ సినిమాలో నటించారు.ఈ రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి.భూమిక విషయానికి వస్తే బాలయ్య సినిమాలో భూమిక గెస్ట్ రోల్ లో రూలర్ మూవీ తెరకెక్కగా ఆ సినిమా ఫ్లాప్ రిజల్ట్ అందుకుంది.

తారక్ కు జోడీగా భూమిక సింహాద్రి, సాంబ సినిమాలలో నటించగా ఈ సినిమాలలో సింహాద్రి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే సాంబ సినిమా యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది.బాలయ్యకు జోడీగా విజయేంద్ర వర్మ సినిమాలో అంకిత నటించగా ఈ సినిమా ఫ్లాప్ అయింది.అయితే తారక్ అంకిత కలిసి సింహాద్రిలో నటించగా ఈ సినిమా సక్సెస్ ను సొంతం చేసుకుంది.
తారక్ శృతి కాంబోలో తెరకెక్కిన రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్ కాగా బాలయ్య శృతి కాంబోలో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కుతోంది.

బాలయ్యకు జోడీగా లయన్ సినిమాలో తారక్ కు జోడీగా దమ్ము సినిమాలో త్రిష నటించగా ఈ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి.బాలయ్యకు జోడీగా నయనతార సింహా, శ్రీరామరాజ్యం, జైసింహా సినిమాలలో నటించగా తారక్ కు జోడీగా అదుర్స్ మూవీలో నటించారు.ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి.
అమీషా పటేల్, షీలా, ప్రియమణి, ఛార్మి, శ్రియ కూడా అటు బాలయ్య ఇటు తారక్ లతో కలిసి నటించడం గమనార్హం.







