నల్లగొండలో నల్లకోటుపై కత్తి గాట్లు-తెలంగాణలో అడ్వకేట్ల వరుస హత్యలు

నల్లగొండ జిల్లా:అడ్వకేట్ విజయ్ రెడ్డిని ఘోరంగా నరికి చంపిన గుర్తు తెలియని దుండగులు.హతుడు ఓ గ్రామానికి సర్పంచ్ భర్త కావడం గమనార్హం.

 Knife Stabs On Nallakotu In Nalgonda-serial Murders Of Advocates In Telangana-TeluguStop.com

అధికార పార్టీ ఎమ్మెల్యే ఆగడాలు తట్టుకోలేక కొంత కాలం క్రితం 121 పేజీల లేఖ వ్రాసి రాజీనామా చేసిన సర్పంచ్.టీఆర్ఎస్ నుండి సర్పంచ్ గా ఎన్నికై ఎమ్మెల్యే ఆధిపత్యం తట్టుకోలేక పార్టీకి రాజీనామా చేసిన సర్పంచ్ దంపతులు.

ఎమ్మెల్యే నుండి తమకు ప్రాణభయం ఉందని గతంలోనే ప్రకటించిన విజయ్ రెడ్డి.సర్పంచ్ పదవికి రాజీనామా చేసినా ఆమోదించని అధికారులు.

అయినా విధులకు దూరంగా ఉంటున్న సర్పంచ్,ఉప సర్పంచ్ కు ఇంచార్జీ బాధ్యతలు.గ్రామంలో పరిస్థితిని ముందే ఊహించిన విజయ్ రెడ్డి నల్లగొండకు మార్చిన మకాం.

తన పొలంలో మందు పిచికారీ చేసేందుకు శనివారం ఉదయం గ్రామానికి వచ్చిన విజయ్ రెడ్డి.సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంటి నుండి పొలం వద్దకు వెళ్తుండగా వెంటాడి చంపిన దుండగులు.

గ్రామంలో తొలి హత్య కావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన గ్రామస్తులు.గ్రామంలో నెలకొన్న రాజకీయ పాత కక్షలే హత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్న స్థానికులు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు,డాగ్ స్క్వాడ్ బృందం.హత్యకు ఉపయోగించిన మరణాయుధాలు పడేసిన బావి వరకు వెళ్లి ఆగిన డాగ్స్.

మృతదేహాన్ని గ్రామ పంచాయతీ ట్రాక్టర్ లో ప్రభుత్వం ఆసుపత్రికి తరలింపు.గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పికెటింగ్.

తెలంగాణ రాష్ట్రంలో నల్లకోటుపై కత్తులు నాట్యం చేస్తుంటే నలుపు రంగు కాస్త ఎరుపు రంగును పులుముకొని న్యాయానికి ప్రతినిధులైన వారి గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.శనివారం సాయంత్రం నల్లగొండలో అడ్వకేట్గా పని చేస్తున్న తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ సర్పంచ్ గాదె సంధ్య భర్త విజయ్ రెడ్డి దారుణ హత్యకు గురైన సంఘటన జిల్లాలో కలకలం రేపింది.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లమ్మగూడెం గ్రామ సర్పంచ్ గాదె సంధ్య గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయడంలేదంటూ,చేసిన పనులకు ఎంబీలు కాకుండా అడ్డుకుంటూ తమను నల్లగొండ అధికార పార్టీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ అధికారులకు ఫిర్యాదు చేసింది.అయినా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనిని ఆరోపణలు చేస్తూ, గత కొంత కాలం క్రితం 121 పేజీల లేఖ వ్రాస్తూ సర్పంచ్ పదవికి రాజీనామా చేశారు.

అయినా ఇప్పటి వరకు రాజీనామాను అధికారులు ఆమోదం తెల్పకుండా అలాగే పెండింగ్ లో ఉంచారు.కానీ, సర్పంచ్ విధులు గ్రామ ఉప సర్పంచ్ (టీఆర్ఎస్)కు అప్పగించారని తెలుస్తోంది.

ఇక గ్రామంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సర్పంచ్ దంపతులు గ్రామం నుండి వెళ్లిపోయి,నల్లగొండ జిల్లా కేంద్రంలోనే నివాసముంటున్నారు.అప్పుడప్పుడు గ్రామానికి వచ్చిపోతూ ఉండే వారు.

శనివారం కూడా పొలానికి మందు కొట్టించాలని విజయ్ రెడ్డి నల్లగొండ నుండి ఎల్లమ్మగూడెం వచ్చారు.సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై పొలానికి వెళుతున్న విజయ్ రెడ్డిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ద్విచక్ర వాహనాన్ని గుద్ది,కత్తులతో ఘోరంగా నరికి చంపి,గ్రామ పంచాయతీ సమీపంలో పడేసి వెళ్లడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

టీఆర్ఎస్ నుండి సర్పంచ్ గా తన భార్య గాదె సంధ్యను గెలిపించుకున్న విజయ్ రెడ్డి,ఎంపీటీసీ ఎన్నికల్లో తాను పోటీ చేయడంతో టీఆర్ఎస్ తో వైరం ఏర్పడినట్లు తెలుస్తోంది.అప్పటి నుండి టీఆర్ఎస్ వర్గీయులతో విభేదాలు ఏర్పడ్డాయి.

గతంలో తన భార్యతో పాటు గ్రామ పంచాయతీకి వెళ్లిన విజయ్ రెడ్డిపై దాడి కూడా జరిగినట్లు,ఆ దాడి చేసింది కాంగ్రేస్ వర్గీయులని సమాచారం.ఆ ఘటన జరిగాక విజయ్ రెడ్డి దంపతులు ప్రాణ భయంతో గ్రామం విడిచి వెళ్లారు.

అయినా శనివారం హత్యకు గురి కావడం అందర్నీ కలవరానికి గురిచేస్తోంది.అడ్వకేట్ విజయ్ రెడ్డి హత్యకు గురైన విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని,డాగ్ స్క్వాడ్ పిలిపించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.హత్య చేయబడిన అడ్వకేట్ వినయ్ రెడ్డికి వృద్ధులైన తల్లిదండ్రులు,భార్య (గ్రామ సర్పంచ్),ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.

హత్య జరిగిన విషయం తెలిసి ఆ వృద్ధ తల్లిదండ్రులు,భార్యపిల్లలు తల్లడిల్లుతున్నారు.మృతుడు వారికి ఏకైక కుమారుడు కావడంతో వృద్ధ దంపతుల కడుపుకోత వర్ణనాతీతంగా మారింది.

హత్యకు గల కారణాలు ఏమిటనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుంది.కానీ,ప్రస్తుతం రాజకీయ కక్షల నేపథ్యంలోనే జరిగి ఉండొచ్చని స్థానికులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube