కామ‌న్వెల్త్ భార‌త క్రీడాకారుల‌కు ప్ర‌ధాని ఆతిథ్యం

కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో ప‌త‌కాలు సాధించిన భార‌త క్రీడాకారుల‌కు ప్ర‌ధాని మోదీ ఆతిథ్యం ఇచ్చారు.ఇటీవ‌ల బ్రిట‌న్ లోని బ‌ర్మింగ్ హామ్ వేదిక‌గా కామ‌న్వెల్త్ క్రీడ‌లు జ‌రిగాయి.

 The Commonwealth Is The Main Host For Indian Athletes , Commonwealth Games,host-TeluguStop.com

ఇందులో భార‌త్ మొత్తం 61 ప‌త‌కాలు సాధించి, ప‌త‌కాల ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో నిలిచిన విష‌యం తెలిసిందే.భార‌త్ సాధించిన ప‌త‌కాల్లో 22 స్వ‌ర్ణాలు, 16 ర‌జ‌తాలు, 23 కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి.

ఈ సంద‌ర్భంగా ప‌త‌క విజేత‌ల‌ను ప్ర‌ధాని మోదీ త‌న నివాసానికి ఆహ్వానించారు.

దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వాలు జ‌రుపుకుంటున్న స‌మ‌యంలో.

క్రీడాకారులు చూపిన ప్ర‌తిభ గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని మోదీ వ్యాఖ్య‌నించారు.హాకీలో పురుషులు, మ‌హిళ‌ల జ‌ట్లు ఉత్త‌మ రీతిలో పోరాడాయ‌న్నారు.

అదేవిధంగా ప‌త‌కాల సాధ‌న‌లో కోచ్ ల పాత్ర ప్ర‌ధాన‌మైంద‌ని పేర్కొన్నారు.ఖేలో ఇండియా ద్వారా యువ‌తలో దాగున్న ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌ని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర క్రీడ‌ల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, క్రీడ‌ల శాఖ స‌హాయ మంత్రి ప్ర‌మాణిక్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube