వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పై రఘురామ సిబ్బంది దాడి కేసుపై క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు.
తన సెక్యూరిటీ సిబ్బంది, కుమారుడిపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కోరారు.ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం .కేసు ఎఫ్ఐఆర్ దశలోనే ఉంది కదా అని అభిప్రాయపడింది.అంతేకాకుండా ఈ కేసులో విచారణ జరగనివ్వాలని సూచించింది.
ఇలాంటి దశలో కేసును కొట్టివేయాలని కోరడం సబబు కాదని అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు… రఘురామరాజు క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది.ఇదే తరహాలో గతంలో ఈ కేసును కొట్టేయాలంటూ రఘురామరాజు వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కూడా కొట్టివేసిన సంగతి తెలిసిందే.







