Snapchat యూజర్స్ కు శుభవార్త... అదిరిపోయే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ మీకోసం!

ప్రముఖ ఫొటో మెసేజింగ్‌ యాప్‌ స్నాప్‌చాట్‌ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు ప్రవేశపెడుతూ వారిని రంజింపజేస్తుంది.

ఇండియన్ స్నాప్‌చాట్‌ యూజర్లకు ఓ శుభవార్త ఏమంటే, ఇంకా రిలీజ్ కాని ఫీచర్లను ఇకపై ఇండియన్ యూజర్లు పొందవచ్చు.

ఈ మేరకు తాజాగా Snapchat+ సబ్‌స్క్రిప్షన్‌ సేవను ఇండియాలో లాంచ్ చేసింది.ఈ సబ్‌స్క్రిప్షన్‌లో యూజర్లు ప్రత్యేకమైన ప్రీ-రిలీజ్ ఫీచర్లను ముందుగానే యాక్సెస్‌ చేసుకోవచ్చు.

అంతేకాకుండా ప్లస్ యూజర్లు స్నాప్‌చాట్‌ టీమ్ నుంచి ప్రత్యేకంగా సపోర్ట్ తీసుకొనే వెసులుబాటు కలదు.అయితే ఇపుడు ఈ సబ్‌స్క్రిప్షన్‌ ధర? ఇందులో ప్రత్యేకమైన ఫీచర్లు? అనే వివరాలు గురించి ఇపుడు తెలుసుకుందాం.యూజర్లు స్నాప్‌చాట్+ సబ్‌స్క్రిప్షన్‌ చేసుకున్నట్లయితే రీవాచ్ ఇండికేటర్, బ్యాడ్జ్, కస్టమ్ యాప్ఐకాన్‌లు, బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్, స్నాప్ మ్యాప్‌లో ఘోస్ట్ ట్రయల్స్, సోలార్ సిస్టమ్ వంటి 6 రకాల ఎక్స్‌క్లూజివ్‌ ఫీచర్లను పొందుతారు.

సరికొత్త కస్టమైజ్డ్ ఫీచర్లతో వచ్చే ఈ సబ్‌స్క్రిప్షన్‌ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరుస్తుంది.భారతదేశంలో స్నాప్‌చాట్ ప్లస్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ను రూ.49గా కంపెనీ నిర్ణయించడం గమనార్హం.ఈ యాప్‌ను భారతదేశంలో 10 కోట్లమంది కంటే ఎక్కువ మంది యూజర్లు వినియోగిస్తున్నారు.ఇండియాలో రూ.50 లోపే సబ్‌స్క్రిప్షన్‌ తీసుకొచ్చినా USలో దాని ప్లస్ సర్వీస్‌కు నెలకు రూ.320 వసూలు చేయడం కొసమెరుపు.ఇండియన్ సబ్‌స్క్రైబర్లు తమ ప్రొఫైల్‌కు స్టార్ హోదాకు సమానమైన స్నాప్‌చాట్+ బ్యాడ్జ్‌ను పొందుతారు.

Advertisement

ఈ ఫీచర్‌ డిఫాల్ట్‌గా టర్న్ ఆఫ్ అయి ఉంటుంది కాబట్టి దీనిని మాన్యువల్‌గా ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది.అలానే సబ్‌స్క్రైబర్లు హోమ్‌స్క్రీన్ ఐకాన్ల ప్యాక్‌ను సైతం పొందుతారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు