కామన్ వెల్త్ క్రీడా విజేతలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రభాస్!

మనదేశంలో ఎవరైనా ఏదైనా సాధించిన దేశం గర్వించే స్థాయికి ఎదిగిన వారిని ప్రోత్సహిస్తూ వారికి శుభాకాంక్షలు తెలపడంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ముందు వరుసలో ఉంటారు.ఇప్పటికే వివిధ రంగాలలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని దేశానికి గర్వకారణమైన వారికి శుభాకాంక్షలు తెలిపిన ప్రభాస్ తాజాగా కామన్ వెల్త్ క్రీడా పోటీలలో విజేతగా నిలిచిన వారికి తన అభినందనలు తెలియజేశారు.

 Prabhas Congratulated The Common Wealth Games Winners ,prabhas ,common Wealth Ga-TeluguStop.com

ప్రస్తుతం ఇంగ్లాండ్లోని బర్మింగ్ హోమ్ లో జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడలలో భాగంగా భారతదేశం నుంచి పోటీ చేసే పథకాలు గెలిచిన వారికి ఈయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రభాస్ ట్విట్టర్ ద్వారా విజేతలుగా నిలిచిన వారి లిస్ట్ షేర్ చేస్తూ.

కామన్ వెల్త్ క్రీడలలో విజయం సాధించిన విజేతలు అందరికీ శుభాకాంక్షలు.మీరు సాధించిన విజయాలతో దేశం గర్వించే స్థాయికి వెళ్ళింది.

మన దేశానికి మెడల్స్ సాధించడంలో మీరు చూపిన పట్టుదల, అంకిత భావం ఎంతో గొప్పవి అంటూ ఈయన విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ విధంగా ప్రభాస్ దేశానికి గర్వకారణమైన వారిని ఎప్పుడు ప్రోత్సహిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు.

ప్రస్తుతం ప్రభాస్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన వరుస పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు.ఈయన నటించిన ఆది పురుష్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.అదేవిధంగా ప్రశాంత్ నీల్ దశకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే వంటి సినిమాలు షూటింగ్ పనులు జరుపుకుంటున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగులతో ప్రభాస్ బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube