బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా అక్కర్లేదు.శిల్పా శెట్టి ప్రస్తుతం సినిమాల్లో నటిస్తే బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే.
కాగా సినిమా షూటింగ్ లోనే తాజాగా శిల్పా శెట్టి గాయపడింది.ఒక వెబ్ సిరీస్ లోని యాక్షన్స్ సన్నీవేషాలలో నటిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆమె కాలు విరిగింది.
ఇదే విషయాన్ని శిల్పా శెట్టి స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపింది.ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.
వాళ్లు రోల్ కెమెరా.యాక్షన్.
బ్రేక్ లెగ్ అన్నారు.అక్షరాల నేను అదే చేశాను.
ఫలితంగా 6 వారాలపాటు షూటింగ్‌కు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది అంటూ పోస్ట్ చేసింది శిల్పా శెట్టి.
అయితే ఈ కాలు బాగు చేసుకుని తొందరలోనే మరింత శక్తితో తిరిగి షూటింగ్ లి పాల్గొంటాను అని తెలిపింది శిల్పా శెట్టి.
అప్పటివరకు నన్ను గుర్తు చేసుకోండి మీ ప్రార్థనలో ఎప్పటికీ మంచి ఫలితాన్ని ఇస్తాయి.కృతజ్ఞతతో మీ శిల్పా శెట్టి కుంద్రా అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది శిల్పా శెట్టి.
ఈమె ప్రస్తుతం రోహిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ పోలీసు ఆఫీసర్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా లీడ్‌రోల్ పోషిస్తుండగా.శిల్పా పోలీసు ఆఫీసర్‌గా కనిపించనుంది.

ఇందుకోసం ఇసుక లో పలు భారీ యాక్షన్ సన్నీవేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో ఈ విధంగా శిల్పా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.అయితే గతంలో కూడా ఇదే షూటింగ్‌లో హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కూడా గాయపడిన సంగతి తెలిసిందే.ఇప్పుడు మళ్లీ శిల్పా శెట్టి ఇదే షూటింగ్ లోనే గాయపడటంతో పలువురు ఈ విషయం పట్ల కలవర పడుతున్నారు.
శిల్పా శెట్టి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఆమె అభిమానులు ఆమె వీలైనంత తొందరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొందరు అయితే మీరు కోరుకున్న విధంగానే మేము ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము.
మీరు వీలైనంత త్వరగా కోలుకొని మళ్ళీ తిరిగి షూటింగ్లో పాల్గొనాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







