ట్రంప్ షాకింగ్ కామెంట్స్...అమెరికా చరిత్రలో ఇలాంటి వేధింపులు లేవు...

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన పదవిని అడ్డుపెట్టుకుని ఎన్నో తప్పులు చేశారని, నష్టాలలో ఉన్న తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకున్నారని, రూలింగ్ లో ఉన్న సమయంలో అధికార దుర్వినియోగం జరిగిందని ట్రంప్ పై గడిచిన ఏడాదిగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విధితమే, దాంతో ట్రంప్ పై విచారణ జరిపించాలని డెమోక్రాట్లు పట్టుబట్టారు.ఈ క్రమంలోనే ఆయన పై ఆదాయపు పన్ను అధికారులు విచారణ చేపట్టారు.

 Trump's Shocking Comments There Is No Such Harassment In The History Of America-TeluguStop.com

అంతేకాదు ఇప్పటికే ట్రంప్ క్యాపిటల్ హిల్ పై దాడి ఘటనపై విచారణ ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే, ఈ విచారణ ఇప్పటికి కొనసాగుతునే ఉంది.ఈ నేపధ్యంలో.

అధ్యక్షుడు అవక ముందు, అయిన తరువాత తన వ్యాపార రంగంలో నెలకొన్ని తప్పిదాలు, మోసాలపై ఇప్పుడు విచారణ ఎదుర్కుంటున్నారు.గోల్ఫ్ కోర్టులు, తనకున్న అధునాతనమైన భవనాల విలువలు ఎక్కువగా చూపించి పన్ను ఎగవేసి అధికారులను, ప్రభుత్వాన్ని మోసం చేశారని వచ్చిన ఆరోపణల నేపధ్యంలో తాజాగా న్యూయార్క్ అటార్నీ జనరల్ ముందు విచారణకు హాజరయ్యారు.

ఈ ఆరోపణలపై న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటీషియా జేమ్స్ విచారణ జరుపుతున్నారు.అయితే ఈ విచారణ నుంచీ తప్పించుకునేందుకు జనరల్ అడిగిన ప్రశ్నలకు బదులు ఇవ్వకుండా రాజ్యాంగంలోని సవరణలను ఉపయోగించి తప్పించుకుంటున్నారని తెలుస్తోంది.

కాగా.

ట్రంప్ మాట్లాడుతూ ప్రస్తుతం నేను ఎదుర్కుంటున్న విచారణలు, భవిష్యత్తులో ఎదుర్కోబోయే మరిన్ని విచారణలు కేవలం రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక దురుద్దేశంతో జరుగుతున్నాయని, ఇలాంటి వాటిని తాను బెదిరిపోనని ప్రకటించారు.

అంతేకాదు నిరంకుశత్వ దేశాలతో అమెరికాను పోల్చుతూ అమెరికాను చివరికి ఎలా తయారు చేశారో చూడండంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ట్రంప్.అయితే ట్రంప్ అధికార దుర్వినియోగం చేశారని చెప్పడానికి బలమైన ఆధారాలు సేకరించామని విచారణ చేపట్టిన అధికారులు ప్రకటించడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube