లెహ‌రాయి చిత్రం నుండి 'అరే చెప్పకు రా మామ నువ్వు చెప్పకు సారీ' పాటను విడుద‌ల చేసిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి

వ‌రుస విజ‌యాలు త‌న ఖాతాలో వేసుకుని త‌న‌కంటూ తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌త్యేఖమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న‌ నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా , ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్,అలీ ముఖ్య‌తారాగాణం గా, ప్రముఖ ద‌ర్శ‌కుల వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ లో ప‌నిచేసిన రామకృష్ణ పరమహంస ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ ఫ్యాష‌న్ తో సినిమా రంగంలోకి అడుగెట్టిన మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం లెహరాయి. ఈ చిత్రం యొక్క టైటిల్ చాలా ఫ్యామ‌స్ కావ‌టం విశేషం.ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జ‌రుపుకుంటుంది.

 Director Anil Ravipudi Launched Song From Lehrayi Movie, Director Anil Ravipudi-TeluguStop.com

నువ్వు ఏడికొస్తే ఆడికెల్తా సువ‌ర్ణ నీ ఇంటి పేరు మారుస్తా సువ‌ర్ణ అంటూ 90 స్ లో ట్రెండింగ్ మ్యూజిక్ ద‌ర్శ‌కుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రం తో జికే ఈజ్ బ్యాక్ అన్న‌ట్టు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసారు.

ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుద‌ల‌య్యిన గుప్పెడంత సాంగ్ ఆర్గానిక్ గా మిలియ‌న్ వ్యూస్ రావ‌టం, ఆ సాంగ్ ని వంద‌ల్లో రీల్స్ చేయ‌టం ఈ సాంగ్ పాపులారిటి తెలుస్తుంది.ఈ స‌క్స‌స్ ని పురస్క‌రించుకుని లెహ‌రాయి చిత్రం నుండి రెండ‌వ సాంగ్ ని కూడా విడుద‌ల చేశారు.

ఈ సాంగ్ ని యావ‌త్ సౌత్ ఇండియాని ఊపేస్తున్న టాలెంటెడ్ ట్రెండి సింగ‌ర్ సిధ్ధ్ శ్రీరామ్ ఆల‌పించారు.తాజాగా ఈ చిత్రం నుండి థర్డ్ సింగిల్ “అరే చెప్పకు రా మామ నువ్వు చెప్పకు సారీ” ను రిలీజ్ చేసాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

ఈ చిత్రం లో మొత్తం 7 సాంగ్స్ వున్నాయి.ప్ర‌తిసాంగ్ అల‌రించే విధంగా వుంటుంది.

మంచి ఫీల్ వున్న క‌థ లో చిత్రాన్ని తెర‌కెక్కించాను.త్వ‌ర‌లో రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేయనున్నట్లు.ప్ర‌ముఖులు న‌టించిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత బెక్కం వేణుగొపాల్ గారు స‌మ‌ర్పించ‌డం చాలా ఆనందం గా వుందని ఇదివరకే ద‌ర్శ‌కుడు రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస తెలిపారు.

నటీనటులు

రంజిత్, సౌమ్య మీనన్,గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్,అలీ,సత్యం రజెష్,జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు.

సాంకేతిక నిపుణులు

ప్రజెంట్ : బెక్కం వేణుగోపాల్, బ్యానర్ : ఎస్ ఎల్ ఎస్ మూవీస్, సినిమా : “లెహరాయి” , నిర్మాత : మద్దిరెడ్డి శ్రీనివాస్, రైటర్, డైరెక్టర్ : రామకృష్ణ పరమహంస, మ్యూజిక్ : జీకే (ఘంటాడి కృష్ణ), డి.ఓ.పి : ఎం ఎన్ బాల్ రెడ్డి, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, లిరిక్ రైటర్స్ :;రామజోగయ్య శాస్త్రి, ఫైట్ మాస్టర్ : శంకర్, కొరియోగ్రాఫర్స్ : అజయ్ సాయి, రైటర్ : పరుచూరి నరేష్, పి ఆర్.ఓ : ఏలూరు శీను, మేఘశ్యామ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube