టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించిన పూర్ణ అనంతరం బుల్లితెర కార్యక్రమాలలో కూడా నటిస్తూ సందడి చేశారు.ఇలా వెండితెరపై బుల్లితెరపై పలు సినిమాలలో నటించిన ఈమె పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో కీలక పాత్రలలో కూడా నటిస్తున్నారు.ఇదిలా ఉండగా గత కొద్దిరోజుల క్రితం ఈమె ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో తన వివాహం కుదిరిందని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామని ప్రకటించారు.
ఈ విధంగా పూర్ణ పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతుందని పెద్ద ఎత్తున అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే ఈమె పెళ్లి కుదిరిందని చెప్పిన కొద్దిరోజులకే పూర్ణా పెళ్లి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక దర్శకుడితో ఈమెకు ఎఫైర్ ఉండటం వల్ల తన పెళ్లి క్యాన్సిల్ అయింది అంటూ పెద్ద ఎత్తున పూర్ణ పెళ్లి గురించి వార్తలు షికార్లు చేశాయి.ఇలా తన పెళ్లి గురించి ఈ విధమైనటువంటి వార్తలు రావడంతో ఈ వార్తలపై పూర్ణ స్పందించారు.

ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా తనకు కాబోయే భర్తతో కలిసి ఎంతో సన్నిహితంగా దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ ఫోటో షేర్ చేసిన ఆమె ఫరెవర్ మైన్ అంటూ క్యాప్షన్ జోడించారు.ఈ క్రమంలోనే ఇలా తన కాబోయే భర్తతో ఎంతో సన్నిహితంగా దిగిన ఫోటోని షేర్ చేస్తూ తన పెళ్లి క్యాన్సిల్ కాలేదని అవన్నీ కేవలం వట్టి పుకార్లు మాత్రమేనని ఈమె క్లారిటీ ఇచ్చారు.అయితే త్వరలోనే ఈమె పెళ్లి తేదీని కూడా ప్రకటించనున్నట్లు సమాచారం.







