వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో రద్దీ నెలకొనే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అంచనా వేస్తోంది.ఆగస్ట్ 11 నుంచి 15వ తేదీ వరకు సెలవుల కారణంగా తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని వృద్ధులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు తిరుమల పర్యటనను వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.అదేవిధంగా సాధారణ భక్తులు ప్రణాళిక బద్ధంగా ముందుగానే దర్శనం, వసతి బుక్ చేసుకుని రావాలని సూచించింది.







