అమెరికా రాజకీయాల్లో కలకలం రేగింది.దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో రిసార్ట్‌లో ఎఫ్‌బీఐ తనిఖీలు చేపట్టింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ట్రంప్ స్వయంగా వెల్లడించారు.అయితే ఎఫ్‌బీఐ ఎందుకు దాడులు చేసిందనేది మాత్రం తెలియరాలేదు.
మరోవైపు ఈ సోదాలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు.ఇది రాజకీయ కక్షసాధింపు చర్యగా ఆయన అభివర్ణించారు.మాజీ అధ్యక్షుడి ఇంటిపై దర్యాప్తు సంస్థ దాడులు చేయడం దేశానికి గడ్డు కాలమన్నారు.గతంలో ఏ మాజీ అధ్యక్షుడికి ఇలా జరగలేదని డొనాల్డ్ ట్రంప్ గుర్తుచేశారు.తనకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎఫ్‌బీఐ అధికారులు సోదాలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా తనను అడ్డుకునేందుకు అధికార డెమొక్రాట్లు కుట్ర పన్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు.అయితే దాడుల సమయంలో ట్రంప్ ఫ్లోరిడా నివాసంలో లేరని.న్యూజెర్సీలో వున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అయితే 2021 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాతి నుంచి ట్రంప్ తన రాజకీయ కార్యకలాపాలను ఇక్కడి నుంచే నిర్వహిస్తున్నారు.వైట్‌హౌస్‌ను వీడే సమయంలో క్లాసిఫైడ్ రికార్డులను ట్రంప్ మార్-ఎ-లాగోకు తీసుకొచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 10 గంటలకు రిసార్ట్‌లోని గోల్ఫ్ క్లబ్‌లో సోదాలు నిర్వహించిన ఎఫ్‌బీఐ అధికారులు 15 బాక్స్‌లను తీసుకుని తిరిగి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.దాదాపు 30 మంది ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ఇవన్నీ కూడా ట్రంప్ తీసుకొచ్చారనే ఆరోపణలు వున్నాయి.
ఇందులో దేశానికి సంబంధించిన రహస్య పత్రాలు , కీలక పత్రాలు వున్నట్లుగా తెలుస్తోంది.ఒకవేళ ఈ క్లాసిఫైడ్ పత్రాలను ట్రంప్ అక్రమంగా తీసుకెళ్లినట్లు రుజువైతే మాత్రం చట్టపరంగా చర్యలు తప్పవని అమెరికన్ న్యాయ నిపుణులు చెబుతున్నారు.అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఏ పదవి చేపట్టకుండా ట్రంప్‌పై నిషేధం విధించే అవకాశం వుంది.
అదే జరిగితే 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఆయన అనర్హుడు.మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.