ఇక రేవంత్ టైమ్ స్టార్ట్ ! సత్తా చాటే ఛాన్స్ ఇదే ?

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తారనే పేరు ఉంది.ఆ దూకుడు పార్టీలో చాలామందికి నచ్చినా.

ఆ పార్టీలోని సీనియర్ నాయకులకు మాత్రం ఏ మాత్రం నచ్చదు.దశాబ్దాలుగా కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించిన తమను పక్కనపెట్టి రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టడం చాలామంది సీనియర్ నేతలకు ఇప్పటికీ నచ్చిని విషయమే.

అంతేకాకుండా ప్రాధాన్య క్రమంలోనూ రేవంత్ కు అధిష్టానం పెద్దపేట వేయడం,  బాగా జూనియర్ అయిన రేవంత్ సారధ్యంలో తాము నడుచుకోవాల్సి రావడం,  సీనియర్ నేతలకు మింగుడు పడని విషయమే.ఈ కారణంతోనే చాలామంది పార్టీ సీనియర్లు వేరే పార్టీలోకి జంప్ అవ్వగా,  ఇప్పుడు మరికొంతమంది వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను ఢీకొట్టే స్థాయిలో సత్తా ఉన్న నాయకుడుగా రేవంత్ ను కాంగ్రెస్ లోని మెజారిటీ నాయకులతో పాటు , అధిష్టానం పెద్దలు గుర్తిస్తున్నారు.      ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు బయటకు వెళ్లినా,  పార్టీలోనే ఉంటూ జగ్గారెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు విమర్శలు చేసినా రేవంత్ మాత్రం తనదైన శైలిలోని పార్టీని ముందుకు తీసుకు వెళుతున్నారు.

Advertisement

రాబోయే రోజుల్లో తన వ్యతిరేక వర్గం అంతా ఇతర పార్టీలో చేరడం, రాజకీయంగా సైలెంట్ అయిపోవడమో జరుగుతోంది.అదే జరిగితే రేవంత్ కు ఇదే సరైన సమయంగా తన సత్తా చాటుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.

  ప్రస్తుతం రేవంత్ వర్గం కు కాంగ్రెస్ లో మంచి ప్రాధాన్యం ఉన్న పదవులను దక్కించుకుంది.ఇప్పుడు సీనియర్లు ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతే, పూర్తిస్థాయిలో రేవంత్ అనుకూల వర్గం నాయకులు మాత్రమే కాంగ్రెస్ లో ఉంటారు.

తమ వర్గం నాయకులతోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు, తన మాటను నవ్వించుకునేందుకు రేవంత్ కు అవకాశం ఏర్పడుతుంది.     

ఇప్పుడు వరకు గ్రూపు రాజకీయాలతో తెలంగాణ కాంగ్రెస్ సతమతం అయింది .నాయకులు మధ్య ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం లేకపోవడం, ప్రత్యర్థులపై విమర్శలు చేయడం కంటే సొంత నేతల ఎదుగుదలను అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్లు పనిచేశారు.  కానీ ఇప్పుడు రేవంత్ కు అటువంటి ఇబ్బందులు ఉండవు.2023 ఎన్నికల్లో టిఆర్ఎస్, బిజెపి లకు ధీటుగా కాంగ్రెస్ ను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు,  అధికారం దక్కించుకునేందుకు రేవంత్ కు మంచి అవకాశం దొరికినట్లే ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే రేవంత్ కు ఇక రానున్న రోజుల్లోనూ తిరుగు ఉండదు.  కానీ ఎన్నికల ఫలితాలు కనుక తేడా కొడితే రేవంత్ రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడినట్లే.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు