తెలుగు తమిళ భాషలలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిన్నటి తరం కథానాయక మీనా గురించి అందరికీ సుపరిచితమే.ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో తెలుగు తమిళ భాషలలో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన మీనా వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇకపోతే మీనా విద్యాసాగర్ అనే ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరి వైవాహిక జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది.జూన్ 29వ తేదీ మీనా భర్త విద్యాసాగర్ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ కన్నుమూసిన విషయం మనకు తెలిసిందే.
మీనా తన భర్త ప్రోత్సాహంతో తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈమె జీవితంలో ఊహించని విధంగా తన భర్త మరణించడంతో ఈమె తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు.
ఇక మీనా భర్త మృతి చెందారనే విషయం తెలియగానే ఆమె సహనటీమణులు ఒక్కొక్కరు తన ఇంటికి వెళ్తూ తనలో మనోధైర్యాన్ని నింపుతున్నారు.ఇలా ఇప్పుడిప్పుడే మీనా తన భర్త లేరనే విషయం నుంచి బయటపడుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా మీనా ఇంటికి సీనియర్ హీరోయిన్లు రంభ, సంఘవి, సంగీత వెళ్లినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ ముగ్గురు హీరోయిన్లు తనని పరామర్శించి తనకు ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ ముగ్గురు మీనా ఇంటికి వెళ్లడంతో అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఫోటోలు దిగారు.భర్త మరణం తర్వాత మీనా మొదటి సారి సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలను షేర్ చేయడంతో ఆమె తిరిగి మామూలు స్థితికి వస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే మీనా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక మీనా విద్యాసాగర్ గారాలపట్టి నైనిక ఇప్పటికే బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.







